వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు- ఇరు బలగాల మోహరింపు-లడఖ్‌లో ఆర్మీఛీఫ్

|
Google Oneindia TeluguNews

ఓవైపు కరోనా సంక్షోభం కొనసాగుతుండగానే భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. చైనాతో జరిగిన ఐదో విడత చర్చలు కూడా విఫలమైన నేపథ్యంలో ఇరు దేశాలూ భారీగా బలగాలను మోహరిస్తున్నాయి. దీంతో తాజా పరిస్ధితిని సమీక్షించేందుకు ఆర్మీఛీఫ్ నరవణే లడఖ్ లో పర్యటిస్తున్నారు. సరిహద్దుల్లో తాజా పరిస్ధితిపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

Recommended Video

Indian Army Chief Visits Ladakh Amid Tensions Between India And China
చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు...

చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు...

చైనా సరిహద్దుల్లో వివాదాస్పద ప్రాంతమైన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్.ఎ.సి) వద్ద తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితులు కలవరం రేపుతున్నాయి. కరోనా సంక్షోభాన్ని కూడా లెక్కచేయకుండా చైనా దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో లడఖ్ సెక్టార్ లో తాజా పరిస్దిని కేంద్రం నిశితంగా గమనిస్తోంది. అదే సమయంలో లఢక్ సెక్టార్ లోని 14 కార్ప్స్ ను ఆర్మీ ఛీఫ్ ఎం.ఎం.నరవణే సందర్శించారు. అత్యంత గోప్యంగా సాగిన ఈ పర్యటనలో తాజా పరిస్దితిని ఆర్మీఛీఫ్ అంచనా వేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రతీ సారీ ఆర్మీఛీఫ్ పర్యటన వివరాలను వెల్లడించే ప్రభుత్వం.. ఈసారి మాత్రం గోప్యంగా ఉంచింది

సరిహద్దుల్లో బలగాల మోహరింపు..

సరిహద్దుల్లో బలగాల మోహరింపు..


ఎల్ఏసీ పొడవునా నాలుగు చోట్ల ఇరుదేశాలకు చెందిన బలగాలు తాజాగా పరస్పరం కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. దీంతో పరిస్ధితిని స్వయంగా అంచనా వేసేందుకు ఆర్మీఛీఫ్ లడఖ్ లో పర్యటించారు. ఈ నెల 5,6 తేదీల్లోనూ ఇరుదేశాల సైనికుల మధ్య ప్యాంగాంగ్, డేమ్చోక్, గల్వాన్ లోయల్లో బాహాబాహీ కూడా జరిగింది. ఇనుప రాడ్లు, కర్రలతో సాగిన ఈ పోరులో చాలా మంది గాయపడ్డారు కూడా. అదే సమయంలో రాళ్ల దాడులు కూడా జరిగాయి. ఆ తర్వాత 9వ తేదీన సిక్కింలోని నకులా పాస్ వద్ద కూడా 150 మంది ఇరుదేశాల సైనికులు నేరుగా తలపడ్డారు. అప్పటి నుంచీ పరిస్ధితి ఉద్రిక్తంగానే కనిపిస్తోంది. ఆధిపత్యం కోసం ఇరుదేశాలు సరిహద్దుల్లోకి అదనపు బలగాలను పంపుతున్నాయి.

ఐదు విడతల చర్చలు విఫలం..

ఐదు విడతల చర్చలు విఫలం..


వివాదాస్పద సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరుదేశాల సైనికాధికారుల మధ్య ఐదు రౌండ్ల చర్యలు జరిగినా ఫలితం లేకపోయింది. చర్చలు విఫలమైన నేపథ్యంలో ఉద్రిక్తతలను నివారించేందుకు ఆర్మీ ఛీఫ్ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. గతేడాది కేంద్ర ప్రభుత్వం చైనా సరిహద్దుల్లోని దేప్సాంగ్-గల్వాన్ లోయకు మధ్య 255 కిలోమీటర్ల పొడవైన డర్బుక్-షయాక్-డీబీవో రహదారి నిర్మాణం తలపెట్టింది. దీనిపై ఆగ్రహంగా ఉన్న చైనా బలగాలు కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి.

English summary
army chief mm naravane reviews the latest security situtation in ladakh amid border tension with china as fifth round of talks also fails recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X