వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుష్మా గర్విష్టి, అతితెలివి చాలు, అందుకే దురహంకారం: భారత్‌పై చైనా అక్కసు

చైనా మీడియా భారత్‌పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ను వెనుకేసుకొచ్చింది. పాక్ ఉగ్రవాదుల స్వర్గధామంగా మారిందని భారత్ ఐరాసలో ఎండగట్టిన విషయం తె

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనా మీడియా భారత్‌పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ను వెనుకేసుకొచ్చింది. పాక్ ఉగ్రవాదుల స్వర్గధామంగా మారిందని భారత్ ఐరాసలో ఎండగట్టిన విషయం తెలిసిందే.

చదవండి: అలా మాట్లాడుతుంటే పడిపడి నవ్వారు: పాకిస్తాన్ దమ్ముదులిపిన సుష్మా

సుష్మాను గర్విష్టి అంటూ

సుష్మాను గర్విష్టి అంటూ

ఐక్య రాజ్య సమితిలో సుష్మా స్వరాజ్ ప్రసంగంపై చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సుష్మాను గర్విష్టిగా అభివర్ణించింది. పాక్‌ను ఉగ్రవాదం ఎగుమతి చేస్తున్న దేశంగా పేర్కొనడం అసంబద్ధమైన చర్యగా పేర్కొంది. అలా మాట్లాడటం రాజకీయంగా అసంబద్ధమైన చర్యగా పేర్కొంది.

అదేమైనా పాక్ జాతీయ విధానమా?

అదేమైనా పాక్ జాతీయ విధానమా?

ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు పాకిస్తాన్ తన సర్వశక్తులు ఒడ్డుతోందని పత్రిక పేర్కొంది. వారి చారిత్రక వివాదాలతో టెర్రరిజాన్ని కలగాపులగం చేయవద్దని పేర్కొంది. పాకిస్థాన్‌లో ఉగ్రవాదం ఉన్న మాట వాస్తవమేనని, అదేమైనా వారి జాతీయ విధానామా? ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం ద్వారా పాక్ డబ్బు.. గౌరవం.. పొందుతోందా? అని ప్రశ్నించింది.

పాకిస్తాన్ ఒక్కడే ఉగ్రవాదుల స్థావరం కాదు

పాకిస్తాన్ ఒక్కడే ఉగ్రవాదుల స్థావరం కాదు

ఆ దేశాన్ని దుష్టదేశంగా చూపుతున్న భారత్ ఏమైనా సుశిక్షతులైన ఇంజినీర్లు, డాక్టర్లు అందిస్తున్న నిజమైన ఐటీ సూపర్‌ పవరా? అని ప్రశ్నించింది. ఇస్లామాబాద్‌ ఒక్కటే ఉగ్రవాదులకు స్థావరం కాదని పేర్కొంది. విషయాన్ని భారత్‌తో సహా అమెరికా మిగిలిన దేశాలు గుర్తించాలని పేర్కొంది.

భారత్‌కు సుద్దులు

భారత్‌కు సుద్దులు

పాకిస్థాన్‌పై దుర‌భిమానం క‌లిగి ఉండ‌టం ప్ర‌పంచ‌శ‌క్తిగా ఎద‌గాల‌నుకొంటున్న భారత్‌కు స‌రిపోద‌ని వ్యాఖ్యానించింది.
అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ ఏ విధంగానైతే అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ఇచ్చారో, భారత్ ఫస్ట్ అనే నినాదాన్ని ఇవ్వడం ద్వారా భారతీయుల్లో జాతీయవాదాన్ని రగిలించాలని సూచించింది. వారికంటే కూడా ముందు ఈ ల‌క్ష్యాన్ని చేరుకోవ‌చ్చ‌ని, అలా చేరుకోలేని సమయంలోనే, తమ సొంత ఇష్టాలను ఇతరులపై రుద్దడానికి విమర్శలు గుప్పిస్తారని ఆరోపించింది. కానీ భారత్‌ అలా చేయవద్దని సూచించింది.

అందుకే భారత్‌కు అహంకారం

అందుకే భారత్‌కు అహంకారం

గత కొంత కాలంగా భారత ఆర్థిక వ్యవస్థ, విదేశాలతో సత్సంబంధాలు స్థిరంగా, సానుకూలంగా ఉన్నాయని, అయితే తన దురంహకారంతో పాకిస్థాన్‌ను చిన్న చూపు చూస్తోందని, చైనాను అహంకారిగా భావిస్తోందని చైనా మీడియా పేర్కొంది.

ఇక మీ తెలివితేటలు చాలు, చైనాకు అలా ఏం లేదు

ఇక మీ తెలివితేటలు చాలు, చైనాకు అలా ఏం లేదు

అమెరికా, యూరప్‌లపై ప్రేమను కనబరుస్తూ పొరుగు దేశాలను చూసి భయపెడుతోందని ఇక మీ తెలివితేటలు చాలునని, చైనాతో స్నేహంగా ఉంటూ, పాకిస్థాన్‌ను గౌరవించాలని సుద్దులు చెప్పింది. వివాదాలను పక్కకు పెట్టి, దౌత్యపరంగా సరిహద్దుల వద్ద సుహృద్భావంతో వ్యవహరించాలని పేర్కొంది. భారత్‌ను అడ్డుకోవాలనే కాంక్ష చైనాకు లేదని, నిజాయతీగా చెప్పాలంటే అది చైనాకు కూడా మంచిది కాదని పేర్కొంది.

English summary
Terming as "arrogant" External Affairs Minister Sushma Swaraj's scathing attack on Islamabad at the UN for being the pre-eminent terror factory, a state- run Chinese daily has in a grudging admission said "there is indeed terrorism in Pakistan".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X