• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చార్లీహెబ్డో కార్టూన్ ప్రచురించారని దాడి: గర్ల్‌‌ఫ్రెండ్ డేంజరస్, ఫ్రిజ్‌లో దాక్కొని..

By Srinivas
|

ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా ఆదివారం నాడు ఐక్యతా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో యూకే ప్రధాని డేవిడ్ కామెరూన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ తదితరులు పాల్గొంటారు. గత వారంలో మూడు రోజుల పాటు ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 17మంది ప్రాణాలు కోల్పోయారు.

వారికి నివాళులు అర్పిస్తూ శనివారం నాడు 70 లక్షల మంది ప్రజలు ర్యాలీ తీశారు. ఇందులో భాగంగానే ఆధివారం ఐక్యతా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి ప్రభుత్వం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది రెండువేల మంది పోలీసు అధికారులు, 1,350 మంది జవానులు రాజధాని అంతటా భద్రత నిర్వహిస్తున్నారు.

ఫ్రాన్స్ అంతటా హైఅలర్ట్ ప్రకటించారు. కాగా, చార్లీ హెబ్డో కార్టూన్లు ప్రచురించిన పత్రిక కార్యాలయం పైన జర్మన్లో దాడి జరిగింది. హాంబర్గ్‌లోని పత్రిక కార్యాలయంలోకి రాళ్లు విసిరిన దండగులు నిప్పు పెట్టారు. అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఇందులో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది.

తీవ్రవాదం

తీవ్రవాదం

ఇదిలా ఉండగా.. తూర్పు ప్యారిస్‌లోని కోషర్ సూపర్ మార్కెట్లో ఉగ్రవాది జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. మరో ఐదుగురు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. అందులో కొందరు సూపర్ మార్కెట్లోని ఓ ఫ్రిజ్‌లో దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నారు. వీరిలో మూడేళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. చల్లదనానికి ఆ చిన్నారి తట్టుకోలేకపోతే అతని తండ్రి తన కోటులో పిల్లవాడిని దాచాడు. ఆపరేషన్ పూర్తైన తర్వాత, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా వారిని పోలీసులు కాపాడారు.

తీవ్రవాదం

తీవ్రవాదం

మరో వ్యక్తి సింకు కింద దాక్కుని ఉగ్రవాదుల కదలికలతో పాటు లోపల జరుగుతున్న సంఘటనల గురించి ఎప్పటికప్పుడు ఎస్సెమ్మెస్ ద్వారా బయట ఉన్న పోలీసులకు సమాచారాన్ని అందించాడు.

తీవ్రవాదం

తీవ్రవాదం

కౌచీ సోదరులుగా అనుమానిస్తున్న దుండగులు ప్యారిస్ తూర్పు ప్రాంతంలోని చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయంపై దాడికి పాల్పడి నరమేథం ప్రారంభించిన వెంటనే అక్కడి ప్రింటింగ్ ప్రెస్‌లో గ్రాఫిక్ డిజైనర్‌గా పని చేస్తున్న లిలియన్ (26) అనే ఉద్యోగి మెట్ల వద్ద సింకు కింద దాక్కున్నాడు. కొద్దిసేపటికే తేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా సిబ్బందికి ఎస్సెమ్మెస్‌ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేశాడని ప్యారిస్ ప్రాసిక్యూటర్ ప్రాంకోయిస్ మోలిన్స్ విలేకర్లకు తెలిపారు.

తీవ్రవాదం

తీవ్రవాదం

తూర్పు ప్యారిస్‌లోని ఓ సూపర్ మార్కెట్లో తీవ్ర భయోత్పాతం సృష్టించిన తీవ్రవాది అమెడీ కౌలిబలీ మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు కౌలిబలీ స్నేహితురాలైన హయత్ బౌమిడియన్ కోసం ఫ్రెంచ్ దళాలు గాలిస్తున్నాయి. సాయుధురాలైన బౌమిడియన్నే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని భద్రతాదళాలు పేర్కొన్నాయి.

 తీవ్రవాదం

తీవ్రవాదం

ఇదిలా ఉండగా.. సూపర్ మార్కెట్లో రక్తపుటేరులు ప్రవహింప చేసిన అమెడీ కౌలిబలికి చెందినట్లుగా భావిస్తున్న ఒక ఆడియో టేపును ఫ్రెంచ్ రేడియో శనివారం విడుదల చేసింది. సిరియా, మాలిల్లో తీవ్రవాదుల పైన పాశ్చాత్య సైనిక శిబిరాల దాడులను కౌలిబలీ తీవ్రంగా ఖండించాడు. ఆగ్రహం వ్యక్తం చేశాడు. బిన్ లాడెన్ తమకు స్ఫూర్తిప్రదాత అన్నాడు.

English summary
A German newspaper in the northern port city of Hamburg that reprinted Mohammed cartoons from the French satirical paper Charlie Hebdo was the target of an arson attack early Sunday, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more