వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం -రిక్టార్‌పై 7.3 తీవ్రత -సునామీ హెచ్చరిక జారీ -టెన్షన్, అప్రమత్తత

|
Google Oneindia TeluguNews

పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశం న్యూజిలాండ్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేలుపై దీని తీవ్రత 7.3గా నమోదయ్యింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించగా.. దాని ధాటికి సునామీ కూడా పోటెత్తబోతోందనే హెచ్చరికలు జారీ అయ్యాయి..

జగన్ దెబ్బకు రోడ్డున పడ్డ షర్మిల -ఏపీలో ఏబీసీడీ పాలన -ఏం పీకారు? -కర్నూలులో చంద్రబాబు నిప్పులుజగన్ దెబ్బకు రోడ్డున పడ్డ షర్మిల -ఏపీలో ఏబీసీడీ పాలన -ఏం పీకారు? -కర్నూలులో చంద్రబాబు నిప్పులు

న్యూజిలాండ్ ఉత్తర భాగంలోని గిస్బోర్న్ సిటీ తీరానికి 178 కిలోమీటర్ల దూరంలో.. సముద్రమట్టానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీనీ ప్రభావంతో సునామి వచ్చే అవకాశం ఉందని పసిఫిక్ సునామి హెచ్చరికల కేంద్రం (పీటీడబ్ల్యూసీ) ఒక ప్రకటన చేసింది. భూకంపం తీవ్రతకు గిస్బోర్న్ సిటీలోనూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది.

arthquake in New Zealand: Magnitude 7.3 Quake Triggers Tsunami Warning

భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో సునామీ తరంగాలు ఏర్పడే అవకాశం ఉందని పీటీడబ్ల్యూసీ హెచ్చరించడంతో న్యూజిలాండ్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 2011లో క్రైస్ట్ చర్చ్ సిటీకి సమీపంగా 6.3 తీవ్రతతతో భూకంపం సంభవించి, ఆ తర్వాత సునామీ చెలరేగడం, నాటి విపత్తులో 185 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.

viral video:మేయర్ మందు కొట్టిందా? -విజయలక్ష్మికి జనం కన్నా కుక్కలే కరెక్టు -ఆర్జీవీ అనుచిత కామెంట్లుviral video:మేయర్ మందు కొట్టిందా? -విజయలక్ష్మికి జనం కన్నా కుక్కలే కరెక్టు -ఆర్జీవీ అనుచిత కామెంట్లు

English summary
Earthquake in New Zealand: A tsunami warning was issued after an earthquake with an initial magnitude of 7.3 struck east of New Zealand’s north island in the early hours of Friday, the Pacific Tsunami Warning Center (PTWC) said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X