వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూ డిస్కవరీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కొన్ని గంటల్లోనే ఆవర్తన పట్టిక తయారు

|
Google Oneindia TeluguNews

ఆవర్తన పట్టిక ఏర్పాటు చేసేందుకు వందేళ్లు పట్టిన మానవుడికి... కేవలం కొన్ని గంటల్లోనే ఆవర్తన పట్టికను రూపొందించగలిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాంను స్టాన్‌ఫోర్డ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ప్రోగ్రాంకు ఆటం2వెక్ (Atom 2 Vec)గా నామకరణం చేశారు. ఆన్‌లైన్ డేటా బేస్ ద్వారా రసాయన సమ్మేళనాల పేర్లను స్టడీ చేశాక వివిధ రకాల అణువులను వేరు చేయగలిగే సత్తా ఈ ప్రోగ్రాంకు ఉంది.

" ఆవర్తన పట్టికను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించగలదా అనే చిన్న ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నంలో సక్సెస్ సాధించాం" అని స్టాన్ ఫోర్డ్ సైంటిస్ట్ షోచెంగ్ జాంగ్ తెలిపారు. మనుషులు మెదడులో ఎన్నో విషయాలు దాగి ఉంటాయని అదే మెదడులోని అంశాలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పొందుపర్చడంతో చాలా ప్రయోగాలు తేలికవుతాయని చెప్పారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించడమే చాలా కష్టమని జాంగ్ చెప్పారు. దీనికి బదులుగా మెషీన్ ఇంటెలిజెన్స్‌ను రూపొందిస్తే బాగుంటుందనే అభిప్రాయం జాంగ్ వ్యక్తం చేశారు.

Artificial intelligence developed to create periodic table within hours

మానవుని మేధోశక్తిని మించి కొత్త ప్రకృతిని ఆవిష్కరించేలా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజైన్ చేయాలనుందని చెప్పిన జాంగ్... అంతకంటే ముందు మానవుడు కనుగొన్న ఎన్నో అద్భుతాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అవుతుందో లేదో ప్రయోగం చేయాలని చెప్పారు. ఆవర్తన పట్టికను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తిరిగి రూపొందించడం ద్వారా కొంతవరకు నిరూపితమైందని జాంగ్ చెప్పుకొచ్చారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాంపై ఆటం2వెక్ ‌కోడింగ్ ఉపయోగించి గూగుల్ ఇంజనీర్లు సహజ భాషను అనువదించారు. ఇది పదాలను న్యూమరిక్ కోడ్స్, లేదా వెక్టార్ కోడ్‌లోకి మార్చుకుంటుంది.

English summary
Stanford scientists have developed a new artificial intelligence (AI) programme that organised the periodic table of elements in just a few hours - a feat that took mankind nearly a century of trial and error.Called Atom2Vec, the program successfully learned to distinguish between different atoms after analysing a list of chemical compound names from an online database.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X