వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృత్రిమ సూర్యుడు రెడీ: మహాద్భుతం ఆవిష్కరణ: ప్రచండ భానుడు కూడా బలాదూర్: 20 సెకెన్లలోనే

|
Google Oneindia TeluguNews

సియోల్: దక్షిణ కొరియా ఓ మహాద్భుతాన్ని ఆవిష్కరించింది. సృష్టికి ప్రతిసృష్టి చేసింది. నిప్పులు చెరిగే ప్రచండ భానుడికి ప్రతి రూపాన్ని తయారు చేసింది. ఈ డమ్మీ సూర్యుడి ముందు.. అసలు సూర్యుడు కూడా బలాదూర్. సూర్యుడి నుంచి వెలువడే తరంగాలపై అధ్యయనం చేసిన అనంతరం.. అదే స్థాయిలో ఉష్ణోగ్రతను వెల్లడించే గోళాన్ని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు రూపొందించారు. దానిపై ప్రయోగాలు సాగించారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు వెల్లడించారు. దక్షిణ కొరియాలోని కొరియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీ ఈ ప్రయోగానికి వేదికైంది.

ఒవైసీ.. షాకింగ్: అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు సన్నాహాలు: అభ్యర్థి పేరు సైతం ప్రకటనఒవైసీ.. షాకింగ్: అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు సన్నాహాలు: అభ్యర్థి పేరు సైతం ప్రకటన

 20 సెకెన్లకే వంద మిలియన్ డిగ్రీల టెంపరేచర్

20 సెకెన్లకే వంద మిలియన్ డిగ్రీల టెంపరేచర్

ఈ గోళాన్ని మండించిన 20 సెకన్ల వ్యవధిలోనే 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. సూర్యుడితో పోల్చుకుంటే.. ఈ ఉష్ణోగ్రత చాలా అధికం. 20 సెకెన్ల వ్యవధిలో సూర్యుడి నుంచి 15 మిలియన్ డిగ్రీల టెంపరేచర్ మాత్రమే వెలువడుతుందని, దానికి అనేక రెట్లతో కూడిన ఉష్ణోగ్రతను వెలువడేలా తాము దీన్ని రూపొందించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన కృత్రిమ సూర్యుడికి కేస్టార్ అని పేరు పెట్టారు. కేస్టార్ అంటే- కొరియా సూపర్‌కండక్టింగ్ టోకమాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అని అర్థం.

 న్యూక్లియర్ ఫ్యూజన్ ఆధారంగా..

న్యూక్లియర్ ఫ్యూజన్ ఆధారంగా..

అణు కేంద్రకాలు, అణు ధార్మిక శక్తి న్యూక్లియర్ ఫ్యూజన్ ఆధారంగా ఈ కృత్రిమ సూర్యుడిని తయారు చేశారు. వాటిని మిలితం చేయడం ద్వారా లెక్క లేనంత అణను ధార్మిక శక్తి.. వేడి వెలువడేలా చేశారు. న్యూక్లియర్ ఫ్యూజన్ మిలితం చేయడం ద్వారా 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతను రగిలించారు. ఈ డివైజ్‌ను మండించిన అనంతరం 20 సెకెన్ల పాటు అలాగే కొనసాగించారు. అందులో నుంచి వెలువడిన టెంపరేచర్‌ను రికార్డు చేశారు. 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్‌తో ఉష్ణోగ్రత వెలువడినట్లు నిర్ధారించారు.

తొలి దశలో విఫలం..

తొలి దశలో విఫలం..

సియోల్ నేషనల్ యూనివర్శిటీ (ఎస్ఎన్‌యు), , అమెరికాకు చెందిన కొలంబియా యూనివర్శిటీ పరిశోధకులు సంయుక్తంగా కేస్టార్ ప్రయోగాన్ని నిర్వహించారు. కిందటి నెల 24వ తేదీన ఈ కృత్రిమ సూర్యడిని మండిచినట్లు వెల్లడించారు. ఈ తరహా ప్రయోగానికి దక్షిణ కొరియా శ్రీకారం చుట్టడం ఇది కొత్తేమీ కాదు. 2018లోనూ ఈ కృత్రిమ సూర్యుడిని మండించింది. సుదీర్ఘకాలం పాటు దాన్ని కొనసాగించలేకపోయింది. అప్పట్లో 1.5 సెకెన్ల పాటు మాత్రమే డివైజ్‌ను మండించింది. అప్పుడు కూడా వంద మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత వెలువడినప్పటికీ.. ఒకటిన్నర సెకెన్ పాటు మాత్రమే కావడంతో అది రికార్డులకు ఎక్కలేదు.

 పర్యావరణ హిత విద్యుత్ కోసం

పర్యావరణ హిత విద్యుత్ కోసం

పర్యావరణ హిత విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకుని రావడంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు కేస్టార్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ సై-వూ తెలిపారు. వంద మిలియన్ల శక్తితో కూడుకున్న ప్లాస్మాను వెలువరింపజేసేలా చేయడంలో ఈ ప్రాజెక్ట్‌లో కీలకంగా మారిందని అన్నారు. సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణోగ్రతను మించిన వేడిని, శక్తిని 20 సెకెన్ల పాటు ఏకధాటిగా కొనసాగించడం అనేక సవాళ్లతో కూడుకుని ఉన్నదని, దీన్ని తాము అధిగమించామని సై-వూ చెప్పారు. ఇదివరకు చైనా కూడా కృత్రిమ సూర్యుడిని అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.

English summary
South Korea managed to light up an artificial sun at over 100 million degrees for a record 20 seconds. In comparison, the core of the Sun burns at only 15 million degrees Celsius. The researchers established a world record by turning this artificial sun nuclear fusion reactor on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X