వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IBM new CEO:ఐబీఎం కొత్త సీఈఓగా అరవింద్ కృష్ణ... సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్ తర్వాత..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Arvind Krishna To Lead IBM,Replaces Ginni Rometty || Oneindia Telugu

అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహిస్తూ దేశానికి గర్వకారణంగా భారతీయులు నిలుస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ దిగ్గజ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్‌‌లకు భారతీయులు నాయకత్వం వహిస్తుండగా తాజాగా ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్ప్ (ఐబీఎం) సీఈఓగా మరో భారతీయుడు నియమితులు కానున్నారు.

ఐబీఎం కొత్త సీఈఓగా అరవింద్ కృష్ణ

ఐబీఎం కొత్త సీఈఓగా అరవింద్ కృష్ణ

ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్యనాదెళ్ల, గూగుల్ మరియు దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌లకు సీఈఓగా సుందర్ పిచాయ్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఐబీఎంకు అరవింద్ కృష్ణ అనే మరో భారతీయుడు సీఈఓగా నియమితులు కానున్నారు. ఏప్రిల్ నుంచి ఐబీఎం సీఈఓగా 57 ఏళ్ల అరవింద్ కృష్ణ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఐబీఎం సీఈఓగా గిన్నీ రొమెట్టీ వ్యవహరిస్తున్నారు. తన వారసుడిగా అరవింద్‌ పేరును సీఈఓగా ఆయన ప్రకటించారు.

 ఐబీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రస్తుతం బాధ్యతలు

ఐబీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రస్తుతం బాధ్యతలు

అరవింద్ కృష్ణ ప్రస్తుతం ఐబీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐబీఎం క్లౌడ్, ఐబీఎం సెక్యూరిటీ, కాగ్నిటివ్ అప్లికేషన్ బిజినెస్, మరియు ఐబీఎం రీసెర్చ్‌లకు నాయకత్వం వహిస్తున్నారు. అంతకుముందు అరవింద్ కృష్ణ ఐబీఎం సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. దీనికి ముందు ఐబీఎం డేటాకు సంబంధించిన బిజినెస్‌ను చూసుకునేవారు.

ఐఐటీ కాన్‌పూర్‌ నుంచి డిగ్రీ

ఐఐటీ కాన్‌పూర్‌ నుంచి డిగ్రీ

అరవింద్ కృష్ణ ఐఐటీ కాన్‌పూర్‌లో ఇంజినీరింగ్ చేశారు. యూనివర్శిటీ ఆఫ్ ఇలినాయిస్‌ నుంచి పీహెచ్‌డీ చేశారు. ఐఐటీ కాన్‌పూర్‌ మరియు యూనివర్శిటీ ఆఫ్ ఇలినాయిస్‌ నుంచి పలు అవార్డులను పొందారు. 15 పేటెంట్స్‌కు సహరచయితగా వ్యవహరించిన అరవింద్ కృష్ణ... ఐఈఈఈ మరియు ఏసీఎం జర్నల్స్‌కు ఎడిటర్‌గా కూడా ఉన్నారు. సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్‌ల తర్వాత మరో మల్టీ నేషనల్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న మూడో భారతీయుడిగా అరవింద్ కృష్ణ గుర్తింపు పొందారు. క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలోకి ఐబీఎం కాస్త ఆలస్యంగా అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ రంగాన్ని అమెజాన్ మరియు మైక్రోసాఫ్ట్‌లు ఏలుతున్నాయి.

 ఈ ఏడాది చివర్లో పదవీ విరమణ పొందనున్న గిన్నీ రొమెట్టీ

ఈ ఏడాది చివర్లో పదవీ విరమణ పొందనున్న గిన్నీ రొమెట్టీ

ఐబీఎం సీఈఓగా ఎనిమిదేళ్లుగా బాధ్యతలు నిర్వర్తించిన గిన్నీ రొమెట్టీ కంపెనీని లాభాల బాటలో నడిపారు. ఆరు త్రైమాసికాల్లో తొలిసారిగా ఐబీఎం రెవిన్యూ పెంపును చూసింది. ఈ సమయంలో ఆమె సీఈఓగా బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్‌ రంగంలోకి దిగిన ఐబీఎం మరిన్ని చిన్న సంస్థలను కొనుగోలు చేస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఐబీఎం కొనుగోలు చేసిన రెడ్ హ్యాట్ సంస్థ సీఈఓ జేమ్స్ వైట్ హర్ట్స్‌ ఐబీఎం ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపడతారు. మరోవైపు 62 ఏళ్ల రొమెట్టీ ఐబీఎం ఎగ్జిక్యూటివ్ ఛైర్మెన్‌గా కొనసాగుతారు. ఈ ఏడాది చివరిలో ఆమె పదవీవిరమణ పొందనున్నారు.

English summary
Arvind Krishna, 57, who spearheaded the Red Hat deal, is set to lead International Business Machines Corp (IBM) from April after its Chief Executive Officer Ginni Rometty decided to handover the reins of the company's cloud business.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X