వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నో భారతీయ సినిమాలు చూశా: దంగల్ సినిమాపై జీ జిన్‌పింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

బీజింగ్: బాలీవుడ్‌ సినిమాలు చైనాకు రావడం, చైనా సినిమాలు భారత్‌లో ప్రదర్శించడం బాగుందని చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్‌ అన్నారు. ప్రధాని మోడీ, జిన్‌పింగ్‌ల మధ్య రెండు రోజుల పాటు జరిగిన సమావేశాలు ముగిసిన అనంతరం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖలే మీడియాతో మాట్లాడారు.

ఇరువురు దేశాధినేతలు ఆధ్యాత్మికం, వాణిజ్యం, సాంకేతికత, సంప్రదాయం,ఎంటర్‌టైన్‌మెంట్‌, సినిమాల విషయాల్లో పరస్పర సహకారంపై ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు.

As Bollywood Makes Inroads Into China, Xi Jinping Not Immune To Its Charm

తాను ఎన్నో భారతీయు సినిమాలు చూసినట్లు జిన్‌పింగ్‌ చెప్పారన్నారు. బాలీవుడ్‌, స్థానిక భాషల సినిమాలు కూడా చూసినట్లు చెప్పారని తెలిపారు. బాలీవుడ్‌ సినిమాలు చైనాలో, చైనీస్‌ సినిమాలు బాలీవుడ్‌లో ప్రదర్శించడం చాలా బాగుంటుందన్నారని తెలిపారు.

మరిన్ని బాలీవుడ్‌ సినిమాలు చైనాలో ప్రదర్శించాలని జిన్‌పింగ్‌ కోరుకుంటున్నారని గోఖలే అన్నారు. మోడీ-జిన్‌పింగ్‌ల అనధికార సమావేశం నేపథ్యంలో 1982ల నాటి బాలీవుడ్‌ సినిమా 'యే వదా రహా'లోని పాట 'తు హైవహీ దిల్‌ నే జిసే అప్నా కహా' పాట సంగీతాన్ని ప్రత్యేకంగా వినిపించారు.

కాగా, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు పెంచేందుకు భారత్‌ నటుడు అమీర్‌ఖాన్‌ను చైనాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించాలనుకుంటోంది.

English summary
Even Chinese President Xi Jinping is not immune to the strong draw of Bollywood and India's vibrant regional cinema. Xi is fond of Indian movies and has watched a number of them, India's Foreign Secretary Vijay K Gokhale said in Wuhan, where Prime Minister Narendra Modi and Xi held an informal meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X