వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: అమెరికాలో అత్యంత భయానకం.. ఈవారం గడిస్తే చాలన్న ప్రభుత్వం.. అసలేం జరుగుతోంది?

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారిపై ఇతర దేశాల్లో మార్పులు చూసి సంతోషపడాలో.. తమ దేశంలో దుస్థితి చూసి ఏడవాలో అర్థంకాని పరిస్థితి అమెరికా ప్రభుత్వాధినేతలది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 'అమెరికా ఫస్ట్' నినాదం వైరస్ విషయంలోనూ నిజమైందని కొందరంటుంటే, చెత్త విధానాలతో సొంత జనాన్నే చంపుతున్నాడని విమర్శకులు మండిపడుతున్నారు. దేశంలో భయానక స్థితి ఏర్పడబోతున్నదని, మరణాలకు మానసికంగా సిద్ధం కావాలని ట్రంప్ స్వయంగా అన్నారు. ఈ వారం రోజులు గడిస్తేగానీ, ట్రంప్ చెప్పిన 'భయానక స్థితి' ఎఫెక్ట్ ను అంచనావేయగలమని అధికారులు పేర్కొన్నారు.

Recommended Video

US Seeks India Help: Trump Open Request To PM Modi | Oneindia Telugu
వారం గడిస్తే తప్ప..

వారం గడిస్తే తప్ప..


సాక్ష్యాత్తూ అమెరికా ప్రజాఆరోగ్య వ్యవస్థకు చీఫ్ గా వ్యవహరిచే ‘‘సర్జన్ జనరల్ ఆఫ్ యూఎస్'' జెరోమీ ఆడమ్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘అమెరికన్ల జీవితాలకు సంబంధించి ఇది చాలా కష్టతరమైన, విచారకరమైన వారం కాబోతున్నది. పెరల్ హార్బర్, 9/11 దాడుల నాటి ఫీలింగ్. వారం రోజులు గడిస్తేగానీ ఏదీ చెప్పలేని పరిస్థితి''అని సర్జన్ జనరల్ అన్నారు. దీనికితోడు ప్రెసిడెంట్ ట్రంప్ మీడియాతో అన్న మాటలు విన్నా అమెరికా పరిస్థితిని అవగాహన చేసుకోవచ్చు..

చివరి కాంతిరేఖ..

చివరి కాంతిరేఖ..

దేశంలో కరోనా విలయాన్ని చీకటి సొరంగంతో పోల్చిన ప్రెసిడెంట్ ట్రంప్.. సొరంగం చివర్లో కాంతి రేఖ కనిపిస్తున్నదని, ఈ వారం భయానకమే అయినప్పటికీ, ఆ తర్వాత పరిస్థితులు సర్దుమణిగే అవకాశముందని, ఏ ఒక్కరూ ధైర్యం కోల్పోవద్దని భరోసా ఇచ్చారు. కొవిడ్-19 చికిత్స కోసం అన్ని రాష్ట్రాలూ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వాడాలని ఆయన పదేపదే కోరారు. దాదాపు 3 కోట్ల డ్రగ్ డోసుల్ని దేశమంతటా పపనిణీ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. శక్తిమించి పనిచేస్తోన్న వైద్య సిబ్బందిని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తోన్న ప్రజల్ని ఆయన అభినందించారు. పనిలోపనిగా ప్రత్యర్థి చానెళ్లపైనా ‘ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు'అంటూ విరుచుకుపడ్డారాయన.

ఇదీ అమెరికాలో సీన్..

ఇదీ అమెరికాలో సీన్..

సోమవారం ఉదయం నాటికి అమెరికాలోని 50 రాష్ట్రాల్లో కలిసి కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3లక్షల 36వేల 851గా ఉంది. మొత్తం మరణాలు 10వేలకు చేరువయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో అత్యధికంగా 1.23లక్షల మంది ఇన్ఫెక్షన్ కు గురికాగా, అందులో 4,159 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూజెర్సీ, మిచిగన్, కాలిఫోర్నియా, లూసియానా రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. కాగా, యూరప్ దేశాల్లో చోటుచేసుకున్న తాజా పరిణామాలు అమెరికన్లలో ఆశలు చిగురింపజేశాయి..

అక్కడ విలయం ఆగినట్లేనా?

అక్కడ విలయం ఆగినట్లేనా?


ఇటలీ, స్పెయిన్ లో ఊహించనిరీతిలో వైరస్ విలయం సృష్టించింది. ఇటలీలో అత్యధికంగా 15,887 మంది చనిపోగా, 13.055 మరణాలతో స్పెయిన్ రెండో స్థానంలో ఉంది. సోమవారం నాటికి స్పెయిన్ లో 1.35లక్షలు, ఇటలీలో 1.28 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఆశ్చర్యకరంగా ఈ రెండు దేశాల్లో గత వారం రోజులుగా మరణాల రేటు తగ్గుతూ వచ్చింది. స్పెయిన్ లో గత మూడు రోజుల్లో ఒక్కరు కూడా చనిపోలేదు. యూరప్ దేశాల్లో ఒక దశలో పీక్స్ కు వెళ్లిన వైరస్ ఉధృతి.. క్రమంగా తగ్గుముఖంపట్టడాన్ని బట్టి అమెరికాలోనూ అదే జరుగుతుందని, వచ్చే వారం ఆశజనకంగా ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. కాగా,

రోగులపై క్లినికల్ ట్రయల్స్

రోగులపై క్లినికల్ ట్రయల్స్


కొవిడ్-19 వ్యాధికి ఇప్పటిదాకా మందు కనిపెట్టని నేపథ్యంలో, నివారణోపాయంగా మలేరియాకు వాడే ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్‌' ప్రయత్నించాలంటూ ప్రెసిడెంట్ ట్రంప్.. ఆయా రాష్ట్రాలను అభ్యర్థిస్తున్నారు. ఈ డ్రగ్ ను తమ దేశానికి ఎగుమతి చేయాల్సిందిగా ఆయన భారత ప్రధాని మోదీని సైతం రిక్వెస్ట్ చేశారు. అయితే.. కొవిడ్-19కు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడటంపై అమెరికాలో ఇంకా పరిశోధనలు పూర్తికాలేదు. దీంతో ఆ డ్రగ్ వాడకంపై ఇప్పటికీ అనుమానాలున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో.. వైస్ ప్రెసిడెంట్ మైక్ పేన్స్.. ‘‘మూడు వేల మంది కొవిడ్-19 పేషెంట్లు.. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ క్లినికల్ టెస్టులకు అంగీకరించారు''అని వెల్లడించారు.

మొత్తంగా 70వేల మంది బలి..

మొత్తంగా 70వేల మంది బలి..

కరోనా వైరస్ కాటుకు ప్రపంచ వ్యాప్తంగా 70 వేల మంది బలయ్యారు. యూరప్ లో మరణాల రేటు తగ్గిన దరిమిలా ఈ సంఖ్య లక్ష లోపే ఆగిపోతుందనే అంచనాలున్నాయి. అయితే, అమెరికాలో ఈ వారంలో సంభవించబోయే పరిస్థితుల్ని బట్టి మొత్తం మరణాల సంఖ్యలో భారీ పెరుగుదల చోటుచేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. కొవిడ్-19 డ్రగ్ తయారీకి దాదాపు అన్ని దేశాలూ తీవ్రంగానే శ్రమిస్తున్నా, ఫలితాలు రావడానికి ఇంకా సమయంపట్టొచ్చని తెలుస్తున్నది.

English summary
The United States entered one of the most critical weeks so far in the coronavirus crisis with government officials warning the death toll in states such as New York, Michigan and Louisiana was a sign of trouble to come in other states
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X