వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్దమే! సిద్దంగా ఉండాలంటూ సైన్యానికి కిమ్ ఆదేశం: కొరియన్ వార్-2 దిశగా..

రెండో కొరియన్ యుద్దానికి సిద్దంగా ఉండాలంటూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు.

|
Google Oneindia TeluguNews

ప్యోంగ్‌యాంగ్: ప్రత్యర్థి తమపై దాడి మొదలుపెట్టకముందే అప్రమత్తంగా వ్యవహరించాలని భావిస్తున్న అమెరికా.. ఇందుకోసం దక్షిణ కొరియా సహాయంతో అక్కడ తమ బలగాలను మోహరించిన సంగతి తెలిసిందే.

దాదాపు 17,500మంది అమెరికన్ 50 వేల మంది దక్షిణ కొరియా సైనికులు దక్షిణ కొరియాలో ఉల్కీ-ఫ్రీడమ్ గార్డియన్ మిలటరీ డ్రిల్‌ చేపడుతున్నారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న మిలటరీ డ్రిల్ అగస్టు 31వ తేదీన ముగియనుంది.

ఈ పరిణామాలతో ఆందోళన చెందుతుందనుకున్న ఉత్తరకొరియా అందుకు పూర్తి విరుద్దంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. కాళ్లబేరానికి రావడమో.. లేక యుద్దం ఆలోచనను పూర్తిగా విరమించుకుంటామని ఆ దేశం ప్రకటిస్తుందని అమెరికా భావించినప్పటికీ.. పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు.

As U.S.-South Korea Military Exercises Begin, Kim Jong Un Threatens ‘Second Korean War’

రెండో కొరియన్ యుద్దానికి సిద్దంగా ఉండాలంటూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తమ సైనికులకు ఆదేశాలు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. 1950లో దక్షిణకొరియా-ఉత్తరకొరియా మధ్య తొలి కొరియన్ యుద్దం చోటు చేసుకుంది.

కాగా, అమెరికా- దక్షిణ కొరియా సంయుక్తంగా చేబడుతున్న ఉల్కీ-ఫ్రీడమ్ గార్డియన్ మిలటరీ డ్రిల్‌‌లో ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, కొలంబియా, డెన్మార్క్, నెదర్లాండ్, న్యూజిలాండ్ అధికారులు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.
రోజురోజుకు అమెరికాకు మద్దతు పెరుగుతుండటం.. తమ బద్ద శత్రువైన దక్షిణ కొరియా ఆ దేశానికి స్థావరంలా మారడం ఉత్తరకొరియాను కలవరపెట్టే అంశమే. అయినప్పటికీ ఆ దేశం పరిస్థితులను ధీటుగా ఎదుర్కోవాలనే భావిస్తుందే తప్ప.. వెనక్కి తగ్గాలన్న ఆలోచన చేయడం లేదు.

ఇందుకు తగ్గట్లే ఉత్తరకొరియా మీడియాలోను వార్తలు రావడం గమనార్హం. అమెరికా-దక్షిణ కొరియా చేపట్టబోతున్న మిలటరీ డ్రిల్ ను అక్కడి పత్రిక 'అణు యుద్దానికి నిర్లక్ష్యపూరిత కసరత్తులు' అని పేర్కొంది. ఇలాంటి పరిస్థితులు నియంత్రణ లేని అణుయుద్దానికి దారితీస్తాయని దారి తీస్తాయని తెలిపింది.

English summary
North Korea has warned of a “second Korean War” if the U.S. and South Korea go ahead with the annual Ulchi-Freedom Guardian military exercises, which are scheduled to begin Monday and run until Aug. 31.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X