వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అధ్యక్ష హోదాలో.. మాజీ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్‌ ను క్షమించాను పొమ్మన్న ట్రంప్

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడి హోదాలో డోనాల్డ్ ట్రంప్ ఆ దేశ మాజీ భద్రతా సలహాదారు అయిన మైఖేల్ ఫ్లిన్ కు క్షమాభిక్ష ప్రసాదించారు. ఇక ఇదే విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ తన మాజీ జాతీయ భద్రతా సలహాదారు జనరల్ మైఖేల్ టి. ఫ్లిన్ కు పూర్తి క్షమాపణ మంజూరు చేయబడిందని ప్రకటించడం నాకు గొప్ప గౌరవం. ఫ్లిన్ , అతని అద్భుతమైన కుటుంబానికి అభినందనలు, మీకు ఇప్పుడు అద్భుతమైన థాంక్స్ గివింగ్ ఉంటుందని నాకు తెలుసు!" అంటూ ట్రంప్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు .

24 రోజులు మాత్రమే ట్రంప్ ప్రభుత్వంలో భద్రతా సలహాదారుగా మైఖేల్ ఫ్లిన్‌

24 రోజులు మాత్రమే ట్రంప్ ప్రభుత్వంలో భద్రతా సలహాదారుగా మైఖేల్ ఫ్లిన్‌

రిటైర్డ్ ఆర్మీ జనరల్, ఫ్లిన్ 2017 జనవరిలో ట్రంప్ ప్రభుత్వంలో భద్రతా సలహాదారుగా కేవలం ఇరవై నాలుగు రోజులు మాత్రమే విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన పై వచ్చిన ఆరోపణల కారణంగా బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది . అమెరికాలోని రష్యా రాయబారితో తాను జరిపిన పరస్పర చర్చల గురించి ఎఫ్‌బిఐకి అబద్ధం చెప్పినట్లు నేరాన్ని అంగీకరించాడు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై జరిగిన విచారణ సందర్భంగా ఆయన తన నేరాన్ని అంగీకరించాడు.

రష్యా రాయబారి సెర్గీ కిస్ల్యాక్‌తో మాజీ జనరల్ పరిచయాల వివాదం .. నేరం అంగీకారం

రష్యా రాయబారి సెర్గీ కిస్ల్యాక్‌తో మాజీ జనరల్ పరిచయాల వివాదం .. నేరం అంగీకారం

ఫ్లిన్ ట్రంప్ యొక్క మొట్టమొదటి జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు, కాని అప్పటి రష్యా రాయబారి సెర్గీ కిస్ల్యాక్‌తో మాజీ జనరల్ పరిచయాల గురించి వివాదం చెలరేగడంతో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 24 రోజుల తర్వాత 2017 ప్రారంభంలో అతనిని తొలగించారు. ట్రంప్ అభ్యర్థిత్వాన్ని బలపరచటానికి 2016 యుఎస్ ఎన్నికలలో మాస్కో జోక్యంపై మాజీ స్పెషల్ కౌన్సెల్ రాబర్ట్ ముల్లెర్ దర్యాప్తులో నేరాన్ని అంగీకరించారు ఫ్లిన్.

అధ్యక్ష హోదాలో కీలక నిర్ణయం తీసుకున్న ట్రంప్

అధ్యక్ష హోదాలో కీలక నిర్ణయం తీసుకున్న ట్రంప్

విచారణలో దోషిగా తేలిన పలువురు మాజీ ట్రంప్ సహాయకులలో ఫ్లిన్ ఒకరు. మార్చిలో ట్రంప్ ఫ్లిన్‌కు పూర్తి క్షమాపణను గట్టిగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇక తాజాగా ఫ్లిన్ కు క్షమాభిక్ష పెట్టినట్టుగా ట్రంప్ పేర్కొన్నారు . జనవరి 20, 2021 వరకు అధ్యక్షుడిగా కొనసాగనున్న ట్రంప్ తనకున్న కొద్దిపాటి వ్యవధిలో ఇంకా ఏ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారో అని ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది.

English summary
US President Donald Trump pardoned his former national security adviser Michael Flynn who had pleaded guilty to lying to the FBI during the investigation into Russian meddling in the 2016 presidential election. "It is my Great Honor to announce that General Michael T. Flynn has been granted a Full Pardon. Congratulations to GenFlynn and his wonderful family, I know you will now have a truly fantastic Thanksgiving!" Trump wrote on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X