వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త ప్రభుత్వమైనా: చేతులు కలిపిన మోడీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

నయ్ ప్యీ తా: మయన్మార్‌లో జరిగిన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం పాల్గొని, ప్రసంగించారు. మలేషియా, థాయ్‌లాండ్ ప్రధానులతో అంతకుముందు మోడీ భేటీ అయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని, అందుకు మేక్ ఇన్ ఇండియా సరైన వేదిక అన్నారు.

మేక్ ఇన్ ఇండియా పైన మయన్మార్ ప్రధాని నజీబ్ తుస్ రజాక్‌కు మోడీ వివరించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మయన్మార్ కంపెనీలను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. తమ దేశంలో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయన్నారు. 2022 నాటికి దేశంలో ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

అందరికీ ఆవాసం పథకంలో మలేషియా కంపెనీలు భాగస్వామ్యం కావాలన్నారు. బౌద్ధ వారసత్వం, పర్యాటకరంగం సహా పలు అంశాల పైన థాయ్‌లాండ్ ప్రధానితో మోడీ చర్చించారు. మలేషియాలో అవకాశాలను భారత్ అందిపుచ్చుకోవాలని మలేషియా ప్రధాని ఆకాంక్షించారు. మలేషియా, థాయ్ ప్రధానులను భారత్‌లో పర్యటించాలని మోడీ కోరారు.

అసియాన్ శిఖరాగ్ర సదస్సులో..

ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో మోడీ మాట్లాడుతూ... తమది కొత్త ప్రభుత్వమని, అయినా తమ కేంద్రీకరణ ఈస్ట్ ఆసియా పైనే అన్నారు. తనకు హార్థిక స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు అన్నారు. మయన్మార్‌కు భారత్‌తో చారిత్రక సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆసియన్ దేశాలతో భారత్‌కు బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయన్నారు. మయన్మార్ తమకు ముఖ్యమైన మిత్ర పొరుగు దేశం అన్నారు. ఈ సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.

అసియాన్ శిఖరాగ్ర సదస్సు

అసియాన్ శిఖరాగ్ర సదస్సు

అసియాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మయన్మార్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ థాయ్‌లాండ్ ప్రధాని గెన్ ప్రయూత్ చాన్ ఓచాతో కరచాలనం.

అసియాన్ శిఖరాగ్ర సదస్సు

అసియాన్ శిఖరాగ్ర సదస్సు

అసియాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మయన్మార్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ మలేషియా ప్రధాని నజీబ్ తున్ రజాక్‌తో సమావేశమైన దృశ్యం.

అసియాన్ శిఖరాగ్ర సదస్సు

అసియాన్ శిఖరాగ్ర సదస్సు

అసియాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మయన్మార్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ థాయ్‌లాండ్ ప్రధానమంత్రితో కలిసి ఇలా...

అసియాన్ శిఖరాగ్ర సదస్సు

అసియాన్ శిఖరాగ్ర సదస్సు

అసియాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మయన్మార్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ మలేషియా ప్రధాని నజీబ్ తున్ రజాక్‌తో సమావేశమైన దృశ్యం.

అసియాన్ శిఖరాగ్ర సదస్సు

అసియాన్ శిఖరాగ్ర సదస్సు

అసియాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మయన్మార్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడేందుకు వచ్చిన దృశ్యం. ఇది 25వ ఎషియాన్ సమ్మిట్.

అసియాన్ శిఖరాగ్ర సదస్సు

అసియాన్ శిఖరాగ్ర సదస్సు

అసియాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మయన్మార్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఏషియా దేశాల అధినేతలతో చేతులు కలుపుతూ..

అసియాన్ శిఖరాగ్ర సదస్సు

అసియాన్ శిఖరాగ్ర సదస్సు

అసియాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మయన్మార్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఏషియా దేశాల అధినేతలతో చేతులు కలుపుతూ..

అసియాన్ శిఖరాగ్ర సదస్సు

అసియాన్ శిఖరాగ్ర సదస్సు

అసియాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మయన్మార్ వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ దేశాల ప్రతినిధులతో ఇలా...

English summary
Nay Pyi Taw, Nov 11: Prime Minister Narendra Modi, who arrived in Myanmar on Tuesday, will speak at the 12th ASEAN-India Summit today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X