వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసాంజే: ‘కండోమ్ వాడకపోవడం రేప్ అవుతుందా?’

|
Google Oneindia TeluguNews

లండన్: అమెరికా దమననీతిని బయటపెట్టి ఆ దేశ ఆగ్రహానికి గురైన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే మూడు సంవత్సరాల నుంచి లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలోనే తలదాచుకుంటున్నాడు. కాగా, ఎంబసీ నుంచి బయటికి వస్తే అరెస్ట్ చెయ్యాలని లండన్ పోలీసులు కాచూకుని కూర్చున్నారు.

అయితే, అమెరికా రహస్యాలను బయటపెట్టినందుకు అసాంజేను అరెస్ట్ చెయ్యలేరు కాబట్టి, అతడ్ని అరెస్ట్ చేసేందుకు ఓ రేప్ కేసు పెట్టారు. స్వీడన్‌లో అసాంజే ఒకసారి లైసెన్స్ ఉన్న వ్యభిచార గృహానికి వెళ్లి ఓ మహిళతో గడిపాడు. ఇప్పుడు ఆ విషయాన్ని బయటికి తీసి ఆ వేశ్య చేత అసాంజే మీద కేసు పెట్టించారు.

Assange demands UK and Sweden lift arrest threat so he can leave Ecuadorian embassy

కేసు ఏమిటంటే.. అసాంజే తనతో గడిపేముందు కండోమ్ వాడతానని చెప్పాడని, కానీ వాడలేదని ఆమె కేసు పెట్టింది. ఈ విషయంలో అసాంజేను అరెస్ట్ చేసి స్వీడన్ పంపడానికి బ్రిటీష్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అసాంజే కోసం కాపలా కాయడానికి ఇప్పటికే బ్రిటన్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది.

అయితే, ఈ కేసు విషయంలో అసాంజే ఎలాంటి ఆందోళనా వ్యక్తం చేయలేదు. అత్యాచారానికి పాల్పడటం.. కండోమ్ వాడకపోవడమూ రెండు ఒక్కటే అవుతాయా? అని అంసాజే ప్రశ్నిస్తున్నాడు. మీడియాల్లో కూడా అసాంజే ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లుగానే వార్తలు రావడం గమనార్హం. అయితే, ఇక్కడి తాను నుంచి స్వీడన్ వెళితే తనను అమెరికాకు పట్టుకుపోతారని, అక్కడే తనను చంపేస్తారనే భయపడుతున్నాడు అసాంజే.

English summary
Julian Assange will demand on Friday that Sweden and the UK lift any threat of arrest to allow him to walk free from Ecuador’s embassy in London, after a United Nations panel found that his three-and-a-half year confinement at the embassy in London amounted to “arbitrary detention”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X