వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూగోళం వైపు గ్రహశకలాల క్యూ: మరో భారీ అస్టరాయిడ్: ఇంకొన్ని గంటలే: విమానం కంటే పెద్దది

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భూగోళం వైపు గ్రహశకలాలు బారులు తీరినట్టు కనిపిస్తోంది. ఒకదాని వెంట ఒకటి దూసుకొచ్చేస్తున్నాయి. కొద్దిరోజుల కిందటే.. ఓ గ్రహశకలం భూమికి అతి సమీపం నుంచి అనంత విశ్వంలోకి వెళ్లిపోయింది. దాని ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకునే లోపే.. మరొకటి ముందుకొచ్చింది. ఈ తాజా అస్టరాయిడ్ ఇంకొన్ని గంటల్లో భూకక్ష్యలోకి ప్రవేశించబోతోంది. దాని ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై అమెరికా అంతరిక్ష ప్రయోగాల సంస్థ నాసా అధ్యయనం చేస్తోంది. బుధవారం (అక్టోబర్ 7)న ఈ అస్టరాయిడ్ భూకక్ష్యలోకి ప్రవేశించడం ఖాయంగా కనిపిస్తోందని వెల్లడించింది.

 దీని పేరూ..

దీని పేరూ..

భూమి వైపు దూసుకొస్తోన్న ఈ గ్రహశకలానికి 2020 ఆర్‌కే 2గా పేరు పెట్టారు నాసా శాస్త్రవేత్తలు. విస్తీర్ణంలో బోయింగ్ 747 కంటే పెద్దదిగా ఉందని, అపోలోతో దీన్ని పోల్చవచ్చనీ చెబుతున్నారు. ఈ గ్రహశకలం 80 మీటర్ల వెడల్పు, సుమారు 81 మీటర్ల డయా, 118 నుంచి 256 అడుగుల పొడవు ఉందని నిర్ధారించారు. బోయింగ్ 7373 విమానం విస్తీర్ణం 68.5 మీటర్లు ఉంటుంది. సెకెనుకు 6.68 కిలోమీటర్ల వేగంతో ఈ గ్రహశకలం భూమి వైపు వస్తోందని తెలిపారు. భూకక్ష్యలోనికి ప్రవేశించడానికి సమీపించే కొద్దీ దాని వేగం మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తున్నారు.

భూమికి ఎంతదూరంలో ఉంది..

భూమికి ఎంతదూరంలో ఉంది..

ఈ గ్రహశకలం భూమిని ఢీ కొట్టే అవకాశాలు దాదాపుగా లేవని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఢీ కొట్టడానికి గల అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం భూమికి 38,30,238 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్పేస్ రాక.. మరింత వేగాన్ని పుంజుకునే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దాని వేగం సెకెనుకు 6.68 కిలోమీటర్లుగా నమోదైనట్లు తెలిపారు. భూమిని ఢీ కొట్టే అవకాశాలు లేనప్పటికీ.. భూకక్ష్యలోకి ప్రవేశించడమో లేదా అతి సమీపం నుంచి వెళ్లిపోవడమో జరుగుతుందని అన్నారు.

ఈ అద్భుతం ఎప్పుడు?

ఈ అద్భుతం ఎప్పుడు?

ఈస్టర్న్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం... అక్టోబర్ 7వ తేదీన (బుధవారం) మధ్యాహ్నం 1.12 నిమిషాలకు, బ్రిటీష్ సమ్మర్ టైమ్ ప్రకారం.. సాయంత్రం 6:12 నిమిషాలకు ఈ గ్రహశకలం భూమికి అత్యంత సమీపానికి చేరుకుంటుంది. అదే వేగంతో దూసుకెళ్తుంది. ఇక మళ్లీ ఈ గ్రహశకలం పునర్దర్శనం 2027 ఆగస్టులో లభిస్తుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీన్ని సాధారణ కంటితో చూడలేమని వెల్లడించారు. గ్రహశకలాల మీద ఉండే ఉష్ణోగ్రత, అవి దేనితో తయారయ్యాయనే అంశాలపై అధ్యయనం చేయడానికి ఇది ఉపకరిస్తుందని వారు తెలిపారు. మార్స్, జుపిటర్ గ్రహాల మధ్య ఈ అస్టరాయిడ్లు పెద్ద సంఖ్యలో తిరుగాడుతుంటాయని పేర్కొన్నారు.

English summary
The National Aeronautics and Space Administration (NASA) on Tuesday has warned that an asteroid bigger than a Boeing 747 jet is set to collide with Earth's orbit on October 7. The asteroid officially called 2020 RK2, was discovered last month and classified as an Apollo asteroid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X