వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూమిని ఢీకొననున్న ఉల్క: సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్త హెచ్చరిక

భూమికి మరో ప్రమాదం పొంచివుందా? అంటే అవుననే అంటున్నారు ఐర్లాండ్ శాస్త్రవేత్తలు.

|
Google Oneindia TeluguNews

లండన్: భూమికి మరో ప్రమాదం పొంచివుందా? అంటే అవుననే అంటున్నారు ఐర్లాండ్ శాస్త్రవేత్తలు. భూమిని ఓ భారీ ఉల్క ఢీకొనడం ఖాయమని, ఇందుకోసం ప్రపంచం మొత్తం సిద్ధం కావాలని ఐర్లాండ్‌కు చెందిన ప్రఖ్యాత ఆస్ట్రోఫిజిసిస్ట్ ఫిట్జ్ సిమ్మన్స్ హెచ్చరించాడు.

1908లో ఒక చిన్న ఉల్క సైబీరియాలోని తుంగుస్కా ప్రాంతాన్ని ఢీకొనడంతో 800 చదరపు మైళ్ల భూభాగం సర్వనాశనమైందని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఆ స్థాయి ఉల్క ఢీకొంటే ఒక పెద్ద నగరమే భస్మీ పటలం అవుతుందని తెలిపారు.

Asteroid hitting Earth very much possible, warns scientist

అదే పెద్ద ఉల్క ఢీకొంటే జరిగే నష్టం మాత్రం అపారంగానే ఉండనుందని తెలిపారు. మన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఎంతో కృషి చేసి, భూమికి సమీపంలో ఉన్న, మనకు హాని కలిగించే 1800 ఆస్టరాయిడ్స్‌ను గుర్తించారని చెప్పారు.

అయితే, ఇంకా చాలా గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రతిరోజూ మన శాస్త్రవేత్తలు భూమికి దగ్గరగా ఉండే ఉల్కలను గుర్తిస్తూనే ఉంటారని ఫిట్జ్ తెలిపారు. అయితే, వాటి వల్ల హాన ఉండదన్నారు. కాగా, మరో తుంగుస్కా ఘటన ఏ క్షణంలోనైనా జరిగే అవకాశం ఉందంటూ ఆయన ప్రపంచ ప్రజల్ని హెచ్చరించారు.

English summary
The world must be prepared for an asteroid strike, which is just a matter of time, warns a leading astrophysicist from Queen's University Belfast in Northern Ireland.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X