వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ : భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహ శకలాలు... బాంబు లాంటి వార్త చెప్పిన నాసా...

|
Google Oneindia TeluguNews

ప్రపంచమంతా దీపావళి వేడుకల్లో మునిగిపోయిన వేళ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా(National Aeronautics and Space Administration) షాకింగ్ వార్తను వెల్లడించింది. దీపావళి పండుగ రోజే భూమికి దగ్గరగా ఆస్టరాయిడ్ 2020 TB9,ఆస్టరాయిడ్ 2020 ST1 అనే రెండు గ్రహ శకలాలు రానున్నట్లు తెలిపింది. ఈ రెండింటిలో ఆస్టరాయిడ్ 2020 ST1 అత్యంత ప్రమాదకరమని... దీని సైజు ప్రస్తుత తాజ్‌మహల్ పరిమాణానికి దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

ఆస్టరాయిడ్ 2020 ST1 పరిమాణం 175 మీటర్లు అని... గంటకు 28,646కి.మీ వేగంతో ఇది భూమి వైపుకు దూసుకొస్తున్నట్లు వెల్లడించింది.ఆస్టరాయిడ్ 2020 TB9 30మీ. ఎత్తుతో... ఒక యావరేజ్ ఎయిర్‌క్రాఫ్ట్ సైజులో ఉంటుందని తెలిపింది. గంటకు 21,600కి.మీ వేగంతో ఇది భూమి వైపు దూసుకొస్తున్నట్లు పేర్కొంది. ఇది భూమికి 7మిలియన్ల కి.మీ దూరాన ఉన్నట్లు తెలిపింది.

Asteroid twice the size of Taj Mahal to cross Earth on Diwali

ఈ రెండింటితో పాటు మరో రెండు గ్రహశకలాలు కూడా భూమికి దగ్గరగా రానున్నట్లు నాసా వెల్లడించింది. వాటి పేర్లను ఆస్టరాయిడ్ 2020VL1,ఆస్టరాయిడ్ 2019VL5లుగా పేర్కొంది. నవంబర్ 13 నుంచి నవంబర్ 15 తేదీల్లో ఈ రెండు గ్రహ శకలాలు భూమికి దగ్గరగా రానున్నట్లు తెలిపింది. భూమికి చంద్రుడికి మధ్యనున్న దూరానికి మూడు రెట్ల దూరంలో ఆస్టరాయిడ్ 2020VL1 ఉన్నట్లు నాసా తెలిపింది.

Recommended Video

Trump Supporters Against Presidential Elections Results అక్రమంగా అధ్యక్ష స్థానం Jo Biden కైవసం ?

సాధారణంగా 46.5మిలియన్ల కన్నా ఎక్కువ దూరం నుంచి ఏదైనా గ్రహ శకలం అతివేగంతో భూమి వైపు దూసుకొస్తే.. దాని నుంచి ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నట్లుగా పరిగణిస్తున్నారు. ఇప్పటివరకూ నాసా ఇలాంటి గ్రహ శకలాలను 22 గుర్తించింది. అయితే రాబోయే 100 ఏళ్లలో కూడా ఇవి భూమిని తాకే అవకాశం లేదని చెబుతోంది.

English summary
Two asteroids arrive at Earth, one of which is shaped like the Taj Mahal. When Diwali is celebrated across India as well as the world, asteroid 2020 TB9 and asteroid 2020 ST1 will pass close to Earth. According to a report, NASA called the 2020 ST1 dangerous.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X