వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాపై అసలు యుద్ధం: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ రెడీ: ఎమర్జెన్సీ అప్రూవ్ కోసం: జనవరిలో రిజల్ట్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్‌పై అసలు సిసలు యుద్ధం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. కరోనాను నిర్మూలించడానికి మరో వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే రష్యా, చైనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. వచ్చేవారం రష్యాలో మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది రష్యా. ఈ దిశగా రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలను కూడా జారీ చేశారు. కొత్తగా బ్రిటన్ ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్‌ను వినియోగింలోకి తీసుకుని రానుంది. ఈ నెల 7వ తేదీ నుంచి ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.

జనవరి చివరివారంలో..

జనవరి చివరివారంలో..

మరో నెలలో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో ఆస్ట్రాజెనెకా నిర్వహిస్తోన్న క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలు జనవరి చివరి వారంలో వెలువడనున్నాయి. ట్రయల్స్ ప్రభావం ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తుంది. దాని ప్రభావాన్ని నిర్ధారించిన వెంటనే.. వినియోగానికి అనుమతి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలపై ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ తన తాత్కాలిక నివేదికను బ్రిటన్ ప్రభుత్వానికి అందజేసింది.

ఫలితాలను నిర్ధారించిన వెంటనే.. ఎమర్జెన్సీ అప్రూవ్

ఫలితాలను నిర్ధారించిన వెంటనే.. ఎమర్జెన్సీ అప్రూవ్

ఆస్ట్రాజెనెకా నిర్వహిస్తోన్న క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలను వచ్చేనెల చివరి వారం నాటికి వెల్లడిస్తామని అమెరికా ఆపరేషన్ వార్ప్ స్పీడ్ (ఓడబ్ల్యూఎస్) ప్రధాన సలహాదారు మాన్‌సెఫ్ స్లవోయ్ తెలిపారు. బుధవారం నిర్వహించిన ఆ దేశ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. బ్రిటన్‌లో ఆస్ట్రాజెనెకా నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను తెప్పించుకుంటున్నామని, ఈ రెండింటినీ పరిశీలించిన వెంటనే వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.

రెండో వారం నుంచి అధ్యయనం..

రెండో వారం నుంచి అధ్యయనం..

ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను జనవరి ద్వితీయార్థంలో అధ్యయనం చేయడాన్ని ఆరంభిస్తామని మాన్‌సెఫ్ తెలిపారు. సంతృప్తికరమైన ఫలితాలు కనిపించిన వెంటనే అత్యవసర అవసరాల కేటగిరీ కింద వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇస్తామని అన్నారు. అమెరికాలో అమలులో ఉన్న చట్టాల ప్రకారం.. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు పంపిస్తామని, ఆ విభాగం అధికారుల ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయని తాము ఆశిస్తున్నామని మాన్‌సెఫ్ పేర్కొన్నారు.

Recommended Video

Covid-19 Vaccine : North Korea కు Vaccine ఇచ్చి ఆదుకున్న China
నాలుగో దేశంగా అమెరికా నిలుస్తుందా?

నాలుగో దేశంగా అమెరికా నిలుస్తుందా?

రష్యా, చైనా తరువాత కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతి ఇచ్చిన మూడో దేశం.. బ్రిటన్. ఫైజర్ రూపొందించిన వ్యాక్సిన్‌కు బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ దేశ హెల్త్ రెగ్యులేటరీ మిషన్ ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక రష్యా మరో అడుగు ముందుకేసింది. మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వచ్చేవారం చేపట్టబోతోంది. ఈ పరిస్థితుల్లో ఇక అమెరికాలో జనవరి చివరి వారం నాటికి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
AstraZeneca will likely get results of its US Covid-19 vaccine trial in late January and could potentially file for an emergency authorization, the chief adviser for the US government’s Operation Warp Speed program said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X