వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీర్య దాత కావలెను..: కానీ కచ్చితంగా ఆ భావజాలమే ఉండాలి!

|
Google Oneindia TeluguNews

బీజింగ్: ఆమధ్య ఇండియాలో చెన్నైకి చెందిన ఓ జంట.. ఐఐటీ విద్యార్థి స్పెర్మ్ కావాలంటూ ప్రకటన ఇచ్చి దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఐఐటీ స్టూడెంట్ అయితే ఐక్యూ ఎక్కువగా ఉంటుందని, అలాంటి వ్యక్తులకు పుట్టే పిల్లలు తెలివిగలవారై ఉంటారన్న భావనతో ఆ దంపతులు అలాంటి ప్రకటన ఇచ్చారు.

ఇక ఇప్పటి విషయానికొస్తే.. చైనాలో ఓ స్మెర్మ్ బ్యాంక్.. 'కమ్యూనిస్టు' భావాలు ఉన్నవారి వీర్యం కావాలని ఒక ప్రకటన ఇచ్చింది. పెకింగ్ యూనివర్సిటీ థర్డ్ హాస్పిటల్ అనే సంస్థ ఈ స్పెర్మ్ డొనేషన్ డ్రైవ్ చేపట్టింది.

ఇందులో భాగంగా వీర్య దాతకు ఉండాల్సిన లక్షణాల గురించి ఒక ప్రకటన ఇచ్చింది. దాతకు ఎలాంటి రోగం, వ్యాధులు లేకుండా ఉండటంతో పాటు సోషలిస్టు దేశమైన మాతృభూమిని ప్రేమించే వ్యక్తి అయి ఉండాలని, కమ్యూనిస్టు నాయకత్వం పట్ల విధేయత, మద్దతు ఉన్న వ్యక్తి అయి ఉండాలని పేర్కొంది.

At Beijing Sperm Bank, Loyalty To Communist Party A Must

వీర్య దాత వయసు 20-45ఏళ్ల మధ్యలో ఉండాలని పేర్కొంది. అంతేకాదు, సదరు దాతకు ఎటువంటి రాజకీయ వైరాలు ఉండరాదని స్పష్టం చేసింది. ఈ అన్నీ అర్హతలు ఉన్న వ్యక్తి.. వీర్య దానానికి ముందుకు వస్తే.. అతనికి 5500యువాన్లు చెల్లిస్తామని తెలిపింది. అయితే భావజాలానికి సంబంధించిన అర్హతలను ఎలా పరిశీలిస్తారన్నది చాలామందికి తలెత్తుతున్న ప్రశ్న.

చైనాలో కమ్యూనిస్టు భావజాలం బలంగా పాతుకుపోయిన నేపథ్యంలో.. భవిష్యత్తు తరాలు కూడా అటువంటి భావజాలంతోనే ఉండాలన్న ఉద్దేశంతోనే.. సదరు స్పెర్మ్ బ్యాంక్ ఇలాంటి ప్రకటన ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ ప్రకటనపై ఇప్పుడు చైనాలో పెద్ద చర్చే నడుస్తోంది.

English summary
Beijing's only sperm bank has set loyalty to the Communist Party as a prerequisite for donors, in a sign that China's increasing emphasis on ideological training is being extended to the womb.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X