వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రహస్యం: చైనా కొత్త యుద్ధ విమానం గుట్టు రట్టు

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనా అసలు రహస్యం బయటపడింది. చైనా సరికొత్త యుద్ధ విమానం జే-20 స్టీల్త్ ఫైటర్ అతి త్వరలో ప్రపంచం ముందుకు రానుంది. ఇనాళ్లు రహస్యంగా తయారు చేస్తున్నఈ యుద్ద విమానాన్ని ఝూ హై ఎయిర్ షోలో ప్రదర్శిస్తున్నామని చైనా అధికారికంగా వెల్లడించింది.

ప్రపంచ సైనిక శక్తిగా ఎదగాలనుకుంటున్న చైనా అత్యాధునిక టెక్నాలజీతో ఈ సరికొత్త జే-20 యుద్ధవిమానాన్ని రూపొందించింది. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆసక్తిగా గమనిస్తున్న ఈ జే-20 యుద్ధ విమానం మొట్టమొదటిసారి బహిరంగంగా ఆకాశంలో ఎగరనుంది.

ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ విమానాయాన సంస్థ ఏవిక్‌ అధ్యక్షుడు టాన్‌ రుయిసంగ్‌ తెలిపారు. ఇరవై ఏళ్ల కిందట వైమానిక సాంకేతికత విషయంలో చైనా ఎంతో వెనుకబడి ఉందని, కానీ నేడు ఈ రంగంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణితో ముందంజలో ఉందని ఆయన వివరించారు.

అత్యాధునిక టెక్నాలజీలతో రహస్యంగా దూసుకెళ్లగలిగే ఈ యుద్ధ విమానం సుదూరస్థాయి క్షిపణులను అవలీలగా మోసుకెళ్లగలుతుంది. ఈ యుద్ధ విమానంతో ఆసియాలో సూపర్‌ పవర్‌గా తనను తాను చాటుకోవడానికి వీలు అవుతుందని అన్నారు.

At China’s big Air show, J-20 stealth fighter, Pakistani Jets

అంతే కాకుండా గగనతల సామర్థ్యంలో అమెరికాకు ఏమాత్రం తీసిపోమని ప్రపంచానికి తెలుపడానికి చైనా తహతహలాడుతోంది. తన సరిహద్దులను రక్షించుకోవడమే కాదు, వనరులతో సుసంపన్నమైన దక్షిణ చైనా సముద్రంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి సైనికంగా తనను ఎవరూ ఎదుర్కోలేరనే సందేశాన్నిఇవ్వాలని చైనా తహతహలాడుతోంది.

అందులో భాగంగానే తన సైనిక శక్తిని అత్యంత వేగంగా అత్యాధునికరించుకొని తన బలాన్ని చాటుతోంది. దక్షిణాది నగరమైన ఝుహైలో ప్రతి రెండేళ్లకు ఓసారి నిర్వహిస్తున్న వైమానిక ప్రదర్శనలో తన మిలిటరీ సాంకేతికతను, యుద్ధ విమానాలను ప్రదర్శిస్తున్నది.

ఈసారి ఈ వైమానిక ప్రదర్శనలో 42 దేశాలకు చెందిన 152 యుద్ధవిమానాలు కూడా ప్రదర్శించనున్నారు. చైనా ఇంత రహస్యంగా తయారు చేసిన యుద్ద విమానం ఇప్పుడు ఎయిర్ షోలో ప్రదర్శనకు పెట్టడంతో ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

English summary
The new-generation warcraft, will make its public debut at the show to be held in Zhuhai City of Guangdong province from November 1 to 6. The J-20 made its maiden flight in 2011.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X