వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్లోకి దూసుకెళ్ళిన విమానం: పది మంది మృతి

By Narsimha
|
Google Oneindia TeluguNews

మనీలా: ఫిలిప్పీన్స్‌లో ఓ విమానం టేకాపైన కొద్దిసేపట్లోకి ప్రమాదానికి గురైంది. విమానం అదుపుతప్పి ఇంట్లోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో సుమారు పది మంది మృత్యువాత పడ్డారు.

ఫిలిప్పీన్స్‌లో ఓ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ ఇంట్లోకి దూసుకెళ్ళింది. శనివారం ఈ ఘటన చోటు చేసుకొంది. పీపర్ -23 అపాచీ విమానం బులాకన్ ప్రావిన్స్‌లోని ప్లారిడెల్ పట్టణంలోని విమానాశ్రయం నుండి విమానం బయలుదేరిన కొద్దిసేపటికే విమానం అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్ళింది.

At Least 10 Killed as Small Plane Slams Into House in Manila

దీంతో విమానంలోని ఐదుగురితో పాటు ఇంట్లోని ఐదుగురు మృత్యువాత పడ్డారని అధికారులు ప్రకటించారు. ఇంట్లోకి విమానం దూసుకెళ్ళిన వెంటనే విమానం దగ్దమైంది దీంతో మంటలు వ్యాపించాయి.

ఆరుగురు వ్యక్తులు ప్రయాణించే వీలున్న ఈ విమానంలో ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగుు ప్రయాణం చేస్తున్నారు అయితే విమానంలోని ఐదుగురు అక్కడి కక్కడే మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు ఇంట్లోకి దూసుకెళ్ళడానికి ముందే విమానం విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.దీంతో విమానం అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్ళిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Ten people died when a small plane crashed into a house north of the Philippine capital on Saturday, aviation and police officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X