వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ : ఆధునిక బానిసత్వంలో 29 మిలియన్ల మంది మహిళలు,బాలికలు...

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా కనీసం 29 మిలియన్ల మంది మహిళలు,బాలికలు ఆధునిక బానిసత్వంలో మగ్గిపోతున్నారని ఓ తాజా నివేదిక అంచనా వేసింది. బలవంతపు చాకిరీ,బలవంతపు వివాహాలు,అప్పులు తీర్చేందుకు చేసే శ్రమ,గృహ బానిసత్వం ఇలా రకరకాలుగా మహిళలు ఆధునిక బానిసత్వాన్ని అనుభవిస్తున్నారని పేర్కొంది. వాక్ ఫ్రీ యాంటీ-స్లేవరీ ఆర్గనైజేషన్ ఈ నివేదికను రూపొందించింది. సంస్థ కో-ఫౌండర్ గ్రేస్ ఫోరెస్ట్ దీనిపై మాట్లాడుతూ... ప్రపంచంలో ప్రతీ 130 మంది మహిళలు,బాలికల్లో ఒకరు ఆధునిక బానిసత్వాన్ని అనుభవిస్తున్నట్లు చెప్పారు. ఈ లెక్క ఆస్ట్రేలియా జనాభాను మించి ఉంటుందన్నారు.

మానవ చరిత్రలోనే తీవ్రమైన బానిసత్వం

మానవ చరిత్రలోనే తీవ్రమైన బానిసత్వం

ఆధునిక బానిసత్వంపై ఐక్యరాజ్య సమితి న్యూస్ కాన్ఫరెన్స్‌లో గ్రేస్ ఫోరెస్ట్ మాట్లాడారు. మానవ చరిత్రలోనే అత్యంత ఎక్కువమంది ప్రస్తుతం బానిసత్వంలో మగ్గిపోతున్నారని ఆమె వెల్లడించారు. వ్యవస్థీకృతంగా ఒక వ్యక్తి స్వేచ్చను హరించడం... వ్యక్తిగత లేదా ఆర్థిక ప్రయోజనాల కోసం ఒక మనిషి మరొకరిని దోపిడీ చేయడాన్ని ఆధునిక బానిసత్వంగా ఆమె అభివర్ణించారు. ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలైన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్,ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్‌లతో కలిసి వాక్ ఫ్రీ ఆర్గనైజేషన్ ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపారు.

కోవిడ్ 19తో మరింత దుర్భర స్థితి...

కోవిడ్ 19తో మరింత దుర్భర స్థితి...


తమ నివేదికలో వెల్లడైన అంశాల ప్రకారం... బాలికలు తమ పుట్టుక నుంచి జీవితాంతం లింగ అసమానత్వాన్ని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. 99 శాతం మహిళలు లైంగిక దోపిడీ బాధితులేనని,84శాతం మంది బలవంతపు వివాహాలు చేసు చేసుకుంటున్నారని,58శాతం మంది బలవంతపు శ్రమ చేస్తున్నారని తెలిపారు. కోవిడ్ 19 కారణంగా ఆధునిక బానిసత్వంలో వీళ్లంతా మరింత దుర్బర పరిస్థితుల్లోకి నెట్టబడ్డారని పేర్కొన్నారు.

Recommended Video

US Election 2020 : Donald Trump vs Joe Biden, ప్రెసిడెంట్ పోల్స్‌లో ముందువరసలో ఉన్నది ఆయనే!
బానిసత్వంపై పోరు...

బానిసత్వంపై పోరు...

వాక్ ఫ్రీ&ఐరాస సంయుక్తంగా చేపట్టబోతున్న ఎవ్రీ విమెన్-ఎవ్రీ చైల్డ్ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆధునిక బానిసత్వాన్ని ప్రారదోలే క్యాంపెయిన్ మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. దీని ద్వారా బాల్య వివాహాలు,బలవంతపు వివాహాలకు ముగింపు పలికేలా అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికీ 136 దేశాల్లో బలవంతపు వివాహాలు,బాల్య వివాహాలను నేరంగా పరిగణించట్లేదన్నారు. తమ క్యాంపెయిన్ ద్వారా వ్యవస్థీకృత దోపిడీ విధానాలకు ముగింపు పలకాలని కోరనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వలస కార్మికులను వేధింపులకు గురిచేసే కెఫాలా లాంటి విధానాలకు ముగింపు పలికేలా విజ్ఞప్తి చేయనున్నట్లు చెప్పారు.

English summary
A new report estimates that 29 million women and girls are victims of modern slavery, exploited by practices including forced labour, forced marriage, debt-bondage and domestic servitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X