వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యెమన్‌లో భారీ పేలుడు: 46 మంది మృతి, 300మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

అదెన్: యెమెన్‌లో వైమానిక దాడుల కారణంగా దాదాపు 46 మంది మృతిచెందగా.. 300 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. యెమెన్‌ దేశ రాజధాని సనాలో ఆత్మాహుతి ఉగ్రవాదులే లక్ష్యంగా సౌదీ అరేబియా ఆధ్వర్యంలో వైమానిక దాడులు నిర్వహిస్తున్నారు.

At Least 46 Dead After Suicide Blasts Hit Mosques In Yemeni Capital

సనా నగరం పశ్చిమ ప్రాంతంలోని ఫజ్‌ అట్టాన్‌ క్షిపణి కేంద్రంలో దాడుల కారణంగా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. చుట్టపక్కల ప్రాంతాలు మొత్తం దట్టమైన పొగ కమ్ముకొంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అఫ్ఘాన్‍‌లో బాంబు పేలుడు: ముగ్గురు మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్ ప్రావిన్స్ సమీపంలో కారు బాంబు పేలిన సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో ఇద్దరు పోలీసులతో పాటు ఒక మహిళ ఉన్నారు.

English summary
Yemeni medical officials say at least 46 people were killed and more than 300 injured when three suicide bombers attacked two mosques controlled by Shiite rebels in the Yemeni capital, Sanaa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X