వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంచుకొస్తున్న మరో గండం: వణికిపోతున్న అమెరికన్లు, కష్టకాలంలో ట్రంప్ చేయూత!

హర్రీకేన్ హార్వీ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న అమెరికన్లను మరో గండం వెంటాడనుంది. అట్లాంటిక్ సముద్రంలో ఇర్మా తుఫాన్ ఏర్పడటంతో.. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

|
Google Oneindia TeluguNews

హెస్టన్: హర్రీకేన్ హార్వీ సృష్టించిన భీభత్సం హోస్టన్ నగరం మొత్తాన్ని వరదల్లో ముంచెత్తింది. గత కొద్దిరోజులుగా అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.

బిక్కుబిక్కుమంటూ: ఇద్దరి పరిస్థితి విషమం, హర్రీకేన్ బాధితులకు తానా, ఆటా ఆపన్నహస్తంబిక్కుబిక్కుమంటూ: ఇద్దరి పరిస్థితి విషమం, హర్రీకేన్ బాధితులకు తానా, ఆటా ఆపన్నహస్తం

వరదల్లో తమవాళ్లను పోగొట్టుకున్నవారు.. వారి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరోవైపు తుఫాను మృతుల సంఖ్య కూడా 47కు చేరింది. ఇప్పుడిప్పుడే వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తుండటంతో సహాయక చర్యలు మరింత వేగవంతమైనట్లు తెలుస్తోంది.

హెలికాప్టర్ల ద్వారా:

హెలికాప్టర్ల ద్వారా:

వరదల్లో చిక్కుకున్నవారిని గుర్తించేందుకు అధికారులు హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. వేలాది అత్యవసర సహాయ బృందాలు రంగంలోకి దిగి.. ఆపదలో ఉన్నవారిని రక్షిస్తున్నాయి. తిండి, మంచినీళ్లు, దుస్తులు.. ఇతరత్రా వంటివి బాధితులకు సరఫరా చేస్తున్నారు.

శిబిరాలకు తరలింపు:

శిబిరాలకు తరలింపు:

వరదల్లో సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మారినవారు కూడా చాలామందే ఉన్నారు. వీరందరిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. హోస్టన్ నగరమంతా వరమయం కావడంతో.. స్థానికులు కూడా తాత్కాళికంగా నగరాన్ని వీడిపోతున్నారు. సేవా ఇంటర్నేషనల్‌ ద్వారా వివిధ స్వచ్ఛంద సంస్థలు సహాయ పునరావాసాలను సమన్వయం చేసుకుంటున్నాయి. ఇండియన్ ఎన్నారైలు కూడా సహాయక చర్యల్లో తమవంతు సహాయం అందిస్తున్నారు.

ట్రంప్ సహాయం:

ట్రంప్ సహాయం:


హర్రీకేన్ హార్వీ ధాటికి రూ.10లక్షల కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
టెక్సాస్‌, లూసియానా తుఫాను బాధితులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగతంగా 10లక్షల అమెరికా డాలర్లు సహాయం చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈ నిధులను ఎలా ఖర్చు పెట్టాలనే విషయంపై ట్రంప్‌ శ్వేతసౌథం మీడియా ప్రతినిధులతో చర్చించినట్లు తెలుస్తోంది.

ముంచుకొస్తున్న మరో గండం:

ముంచుకొస్తున్న మరో గండం:


హర్రీకేన్ హార్వీ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న అమెరికన్లను మరో గండం వెంటాడనుంది. అట్లాంటిక్ సముద్రంలో ఇర్మా తుఫాన్ ఏర్పడటంతో.. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గం.160కి.మీ వేగంతో దూసుకొస్తున్న ఇర్మా.. శుక్రవారం రాత్రికే పెను తుఫానుగా మారనుందని, రానున్న రోజుల్లో మరింత విజృంభించవచ్చునని మియామీలోని నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ ప్రకటించింది. దీంతో దక్షిణ అమెరికా వాసుల్లో మరోసారి తీవ్ర అలజడి రేగుతోంది.

English summary
President Trump has pledged to donate $1 million from his personal fortune to storm victims in Texas and Louisiana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X