వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిలిటెంట్లతో హోరాహోరీ పోరు... 50 మంది పోలీసుల మృతి

ఈజిప్టులోని గజా నగరంలో మిలిటెంట్లతో జరిగిన పోరులో 50 మందికి పైగా పోలీసులు మృతిచెందారు. నగర సమీపంలోని ఎల్‌-వహాత్‌ ఎడారి ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. అక్కడి బహరియా ఓయాసిస్‌ వద్ద ఉగ్రవాదులు దాగి ఉన్

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

కైరో: ఈజిప్టులోని గజా నగరంలో మిలిటెంట్లతో జరిగిన పోరులో 50 మందికి పైగా పోలీసులు మృతిచెందారు. నగర సమీపంలోని ఎల్‌-వహాత్‌ ఎడారి ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.

అక్కడి బహరియా ఒయాసిస్‌ వద్ద ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం రావడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడకు వెళ్లారు. తనిఖీలు చేస్తుండగా.. వారిపైకి మిలిటెంట్లు హఠాత్తుగా కాల్పులు జరిపారు.

At least 50 police killed in shootout in Egypt’s desert

ఈ ఘటనలో 50 మందికి పైగా పోలీసులు, భద్రతా సిబ్బంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు గాయపడ్డారు. ఎదురుకాల్పుల్లో కొందరు ముష్కరులు కూడా హతమైనట్లు ఈజిప్టు హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అయితే ఎంత మంది మిలిటెంట్లు చనిపోయారు, వారి వివరాలను మాత్రం వెల్లడించాలేదు. మరోవైపు పోలీసులు, భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడింది తామేనంటూ తీవ్రవాద సంస్థ హసమ్‌ ప్రకటించింది.

ఇటీవలి కాలంలో ఈజిప్టులో భద్రతా సిబ్బందిపై మిలిటెంట్ దాడులు ఎక్కువయ్యాయి. 2013లో మహ్మద్‌ మోర్సీని ఈజిప్టు అధ్యక్షుడిగా తొలగించినప్పటి నుంచి ఆర్మీ, పోలీసులపై మిలిటెంట్లు తరచూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో వందల సంఖ్యలో పోలీసులు, సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు.

English summary
Armed militants killed at least 30 police officers in a shootout during a raid on a suspected militant hideout in Egypt's Western desert, security sources said on Friday. A number of suspected militants were also killed and security forces are combing the area, a statement by the Interior Ministry said. Egypt is facing an Islamist insurgency concentrated in the Sinai peninsula from two main groups, including an Islamic State affiliate, that has killed hundreds of security forces since 2013.Islamist militants have launched several major attacks, most recently targeting churches in Cairo and other cities with the loss of dozens of lives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X