• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ర‌క్త‌మోడిన రంజాన్: మసీదు స‌మీపంలో ఆత్మాహూతి దాడి

|

లాహోర్‌: ముస్లింలు ప‌విత్రంగా భావించే రంజాన్ మాసం ఆరంభంలోనే ర‌క్త‌మోడింది. ప్రాచీన మ‌సీదును ల‌క్ష్యంగా చేసుకుని ఆత్మాహూతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుమంది అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. మ‌రో 15 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిని స‌మీప ఆసుప‌త్రికి త‌ర‌లించి, అత్య‌వ‌స‌ర చికిత్స‌ను అందిస్తున్నారు. గాయ‌ప‌డ్డ వారిలో ఎనిమిది మంది ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు చెబుతున్నారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు పోలీసు అధికారులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఆత్మాహూతి దాడికి తామే కార‌ణ‌మంటూ ఇంకా ఏ ఉగ్ర‌వాద సంస్థ ప్ర‌క‌టించ‌లేదు.

పాకిస్తాన్‌లోని లాహోర్‌లో దాతా ద‌ర్బార్ సూఫీ మ‌సీదు స‌మీపంలో బుధ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రంజాన్ మాసం ఆరంభాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో పాల్గొన‌డానికి దాతా ద‌ర్బార్ మ‌సీదుకు పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు చేరుకున్నారు. ద‌క్షిణ ఆసియా దేశాల్లోనే అత్యంత ప్రాచీన మ‌సీదు ఇది. 11వ శతాబ్దంలో దీన్ని నిర్మించార‌న‌డానికి చారిత్ర‌క ఆధారాలు ఉన్నాయి. ఏటా రంజాన్ మాసం ఆరంభంలో ఈ మ‌సీదుకు పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు వ‌స్తుంటారు. ప్ర‌త్యేక ప్రార్థ‌నాల్లో పాల్గొంటారు. వారికి క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త క‌ల్పిస్తుంది అక్క‌డి ప్ర‌భుత్వం. 2010లో ఇదే మ‌సీదును ల‌క్ష్యంగా చేసుకుని ఆత్మాహూతి దాడి చేశారు ఉగ్ర‌వాదులు. ఈ దాడ‌లో అప్ప‌ట్లో 41 మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. అప్ప‌టి నుంచి ఏటా రంజాన్ మాసంలో ఈ మ‌సీదు వ‌ద్ద భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేస్తూ వ‌స్తోంది అక్క‌డి ప్ర‌భుత్వం.

At Least 6 Killed In Blast Near Sufi Shrine In Pakistans Lahore

తాజాగా- భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఇద్ద‌రు ఆత్మాహూతి ద‌ళ ఉగ్ర‌వాదులు మ‌సీదుకు అత్యంత స‌మీపంలో త‌మ‌ను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు పోలీసు అధికారులు స‌హా ఆరుమంది అక్క‌డిక‌క్క‌డే మృత్యువాత ప‌డ్డారు. మ‌రో 15 మంది గాయ‌ప‌డ్డారు. వారిలో ఎనిమిది మంది ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది. గాయ‌ప‌డ్డ వారిలో కొంద‌రు భ‌ద్ర‌తా సిబ్బంది కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. స‌మీపంలోని మాయో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే లాహోర్ సిటీ డివిజ‌న్ ఎస్పీ స‌య్య‌ద్ ఘ‌జ‌న్ షా సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు. దీన్ని ఉగ్ర‌వాద చ‌ర్య‌గా ప్రాథ‌మికంగా నిర్ధారించిన‌ట్లు చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A blast at one of Pakistan's oldest and most popular Sufi shrines killed at least three people and wounded 15 in the eastern city of Lahore Wednesday, state media reported, as the country marks the fasting month of Ramadan.Police have said they are still investigating the nature of the blast, which occurred near the entrance gate for female visitors to the 11th century Data Darbar shrine, one of the largest Sufi shrines in South Asia, the channel and police said. The shrine has been targeted previously, in a 2010 suicide attack that killed more than 40 people, and is guarded by heavy security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more