వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Russia University: విద్యార్థులపై బుల్లెట్ల వర్షం: కిటికీ నుంచి దూకి..పరుగులు తీసిన స్టూడెంట్స్

|
Google Oneindia TeluguNews

మాస్కో: రష్యాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఘాతుకానికి తెగబడ్డాడు. యూనివర్శిటీ విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఊహించని ఈ పరిణామంతో భయాందోళనలకు గురైన పలువురు విద్యార్థులు తరగతి గదుల కిటికీల నుంచి దూకి బయటికి పరుగులు తీశారు. ఈ క్రమంలో కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. అనంతరం పోలీసులు ఆ దుండగుడిని కాల్చి చంపారు.

రాజధాని మాస్కో మాస్కో నుంచి సుమారు 1500 కిలోమీటర్ల దూరంలో ఉండే పెర్మ్ స్టేట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రఖ్యాత పెర్మ్ విశ్వవిద్యాలయానికి బైక్‌పై వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఉదయం 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పెర్మ్ స్టేట్ యూనివర్శిటీ క్యాంపస్‌కు చేరుకున్నాడు. ఆ సమయంలో విద్యార్థులు చాలామంది తరగతి గదుల్లో ఉన్నారు. మరి కొందరు క్యాంపస్‌లో తిరుగాడుతూ కనిపించారు. అదే సమయంలో యూనివర్శిటీ ఆవరణలో ఉన్న ఆడిటోరియంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో గుమికూడి ఉన్నారు.

At least 8 people have died after a gunman opened fire at a university in the Russian city of Perm

క్యాంపస్‌లో అడుగు పెట్టిన వెంటనే ఆ గుర్తు తెలియని వ్యక్తి.. ఆడిటోరియం వైపు దూసుకెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న గన్‌తో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులు సంఘటనా స్థలంలో దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుమందికి బుల్లెట్ గాయాలయ్యాయి. కాల్పుల శబ్దం వినిపించగానే విద్యార్థులు ఆడిటోరియం తలుపులను లోపలి వైపు నుంచి మూసివేశారు. మరో ద్వారం నుంచి బయటికి పరుగులు తీశారు. మరికొందరు తరగతి గదులకు ఉన్న కిటికీల నుంచి బయటికి దూకారు.

ఆ గుర్తు తెలియని వ్యక్తి డబల్ బ్యారెల్ గన్‌ను ఉపయోగించినట్లు స్థానిక పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నల్లరంగు దుస్తులు వేసుకున్నాడని, తలకు హెల్మెట్‌ను ధరించాడని చెప్పారు. నడుముకు బుల్లెట్లతో కూడిన బెల్ట్‌ను కట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి ఆందోళన లేకుండా, నింపాదిగా క్యాంపస్‌లో అతను అడుగు పెట్టాడని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అతను ఇదే యూనివర్శిటీ స్టూడెంట్‌గా మరికొందరు చెప్పారు. దీన్ని పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది.

ఈ కాల్పులకు తెగబడటానికి రాజకీయ పరమైన లేదా మత పరమైన కారణాలేవీ లేవని ఆ గుర్తు తెలియని వ్యక్తి.. తన ఫేస్‌బుక్‌లో పేజీలో రాసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ యూనివర్శిటీలో పలువురు భారతీయ విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు. ఈ కాల్పుల సందర్భంగా వారు సురక్షితంగా తప్పించుకోగలిగారని రష్యాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. భారతీయ విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

English summary
At least eight people have died after a gunman opened fire at a university in the Russian city of Perm, officials say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X