వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్థులకు 'ఆట' సాయం

|
Google Oneindia TeluguNews

డెట్రాయిట్‌ : అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్థులకు బాసటగా నిలిచింది అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ (ఆట). డెట్రాయిట్ తో పాటు బాటిల్ గ్రీక్ డిటెన్షన్ కేంద్రాల్లో ఉన్న విద్యార్థులకు అండగా ఉండేలా చర్యలు చేపట్టింది. వారి తరపున కోర్టులో వాదించడానికి మిషిగన్ ఇమిగ్రేషన్ అటార్నీలను ఏర్పాటు చేసింది. ఆ మేరకు డిటెన్షన్ సెంటర్లలో ఉన్న విద్యార్థులను కలిసేందుకు ఆట ప్రతినిధులు అక్కడకు వెళ్లారు. అటార్నీలు కూడా వారితో పాటు వెళ్లారు.

ATA helping to telugu students who arrested in america

అమెరికాలో అరెస్టైన విద్యార్థులకు సంబంధించిన సమాచారం ఇప్పటికే సేకరించామని తెలిపారు ఆట సభ్యులు. వారి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు ఫోన్ల ద్వారా తమను సంప్రదించారని, ఆ మేరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నామని చెప్పారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ తరపున ఇంకా ఎవరికైనా సహాయం కావాలంటే ఈ మెయిల్ ద్వారా సంప్రదించాలని కోరారు. [email protected] కి మెయిల్ చేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. డిటెన్షన్ సెంటర్లకు విద్యార్థులను కలిసిన వారిలో ఆట సభ్యులు.. సత్య కందిమల్ల (ప్రెసిడెంట్), కరుణాకర్ మాధవరం (ఛైర్మన్), వినోద్ కుకునూర్ (ప్రెసిడెంట్ ఎలక్ట్), వెంకట్ మంతెన (BOD and EC)తదితరులు ఉన్నారు.

English summary
American Telangana Association hired immigration attorneys in Michigan to help telugu students who are arrested and at 2 different detention centers in Detroit & Battle Creek, MI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X