వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాన్ ఆర్మీ చీఫ్ అంతిమయాత్రలో తొక్కిసలాట: 35 మంది దుర్మరణం.. 48 మందికి పైగా..!

|
Google Oneindia TeluguNews

టెహ్రాన్: ఇరాన్ లో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. అమెరికా వైమానిక దాడుల్లో మరణించిన ఇరాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఖాసిం సోలేమని భౌతిక కాయానికి నిర్వహించిన అంత్యక్రియల్లో అనూహ్యంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 35 మంది దుర్మరణం పాలయ్యారు. 48 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రంప్ తలతో రండి.. ఈ భారీ బహుమానంను పట్టుకెళ్లండి: ఇరాన్ ఆఫర్ట్రంప్ తలతో రండి.. ఈ భారీ బహుమానంను పట్టుకెళ్లండి: ఇరాన్ ఆఫర్

 ఇరాక్ లో దుర్మరణం..

ఇరాక్ లో దుర్మరణం..

ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో గల అంతర్జాతీయ విమానాశ్రయంపై శుక్రవారం అమెరికా వైమానిక దళాలు క్షిపణులతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో జనరల్ ఖాసిం సోలేమని దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తరువాత మధ్య తూర్పు దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ వాతావరణానికి పరిస్థితులు దారి తీసేలా కనిపిస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య దౌత్య సంబందాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

అంతిమయాత్రలో వేల సంఖ్యలో

అంతిమయాత్రలో వేల సంఖ్యలో

ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య మంగళవారం జనరల్ ఖాసిం సోలేమని భౌతిక కాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలను పూర్తి చేయడానికి ఇరాన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఖాసిం స్వస్థలం కెర్మన్ పట్టణంలో భారీ ఎత్తున అంతిమయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాసింకు కడసారి వీడ్కోలు పలకడానికి ఆయన అభిమానులు వేల సంఖ్యలో కెర్మన్ పట్టణానికి చేరుకున్నారు. స్వస్థలం కావడం వల్ల అంచనాలకు మించి అభిమానులు, స్థానికులు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు.

 అంతిమయాత్ర మొదలైన కొద్దిసేపటికే..

అంతిమయాత్ర మొదలైన కొద్దిసేపటికే..


ఖాసిం అధికారిక నివాసం నుంచి అంతిమయాత్ర ఆరంభమైన కొద్ది సేపటికే తొక్కిసలాట చోటు చేసుకుందని ఇరాన్ అధికారిక ఛానల్ వెల్లడించింది. ఈ ఘటనలో కనీసం 35 మంది మరణించి ఉంటారని, 48 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారని వెల్లడించింది. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకంగా ఉందనే విషయాన్ని డాక్టర్లను ఉటంకిస్తూ స్పష్టం చేసింది.

English summary
Iranian state television says 35 people have been killed and 48 others injured in a stampede that erupted at a funeral procession for a general slain in a U.S. airstrike. The TV says the stampede erupted in Kerman, the hometown of Gen. Qassem Soleimani where the procession was underway on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X