వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రాన్స్‌లో మరోసారి ఐఎస్ దాడులు: తల తెగి పడింది

|
Google Oneindia TeluguNews

ప్యారిస్: ఫ్రాన్స్‌లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. ఆగ్నేయ ఫ్రాన్స్‌ లయోన్‌ నగరం సమీపంలోని గ్రెనోబుల్‌లో ఉన్న ఓ గ్యాస్‌ ఫ్యాక్టరీపై ఐఎస్‌ఐఎస్‌ సంస్థకు చెందిన ఉగ్రవాది దాడికి దిగాడు. కారులో వేగంగా వచ్చిన ఉగ్రవాది నేరుగా ఫ్యాక్టరీలోకి దూసుకుపోయాడు.

ఫ్యాక్టరీలో అతను విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో పాటు బాంబుల దాడికి పాల్పడ్డాడు. దీంతో వ్యక్తి తల తెగిపడిపోయింది. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఆ ఉగ్రవాది కారులో వెళ్తూ పలు చోట్ల పేలుడు పదార్థాలు ఉంచాడని స్థానిక మీడియా తెలిపింది. ఫ్యాక్టరీపై ఉగ్రవాది ఐఎస్‌ఐఎస్‌ జెండాను కూడా ఎగురవేశాడని పేర్కొంది.

స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం పది గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాది కర్మాగారంలో చొరబడ్డాడన్న వార్తలతో అప్రమత్తమైన ఫ్రాన్స్‌ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

Attack in France: One person beheaded, other injured

అతడిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. పోలీసులు అతడిని తీసుకెళ్లే క్రమంలో ఆ ఫ్యాక్టరీ గేటుపై అరబిక్‌ అక్షరాల్లో అతడు ఏదో రాసి వెళ్లాడని స్థానిక మీడియా తెలిపింది. చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై ఉగ్రదాడులు జరిపిన దాడులకు సరిగ్గా ఆరు నెలల తరువాత ఈ ఘటన జరగడంతో ఫ్రాన్స్‌ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.

చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై జరిపిన దాడుల్లో 17మంది ప్రజలు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో ఇంటీరియర్‌ మినిస్టర్‌ బెర్నాడ్‌ కాజెన్యూ పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. ఫ్రాన్స్ ప్రధాని మాన్వెల్ వాల్స్ భద్రతా దళాలను అప్రమత్తంగా ఉండాలని, దాడి జరిగిన ప్రాంతంలో భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించారు. కాగా, ఈ దాడిని బ్రస్సెల్స్ పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ఖండించారు.

English summary
A man has been beheaded and one other person sustained injuries in a suspected Islamist attack in France on Friday, media reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X