వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు షాక్: 457 వీసా రద్దు, టెంపరరీ వీసాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

మెల్‌బోర్న్:భారతీయ టెక్కీలకు మరో షాకింగ్ న్యూస్. ఇప్పటికే అమెరికా నుండి టెక్కీలకు చేదు వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో అస్ట్రేలియా నుండి కూడ ఇదే తరహ సమాచారం వచ్చింది. హెచ్ 1 బీ వీసాలపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠినమైన నిర్ణయాలు తీసుకొంది. అదే తరహలో 457 వీసాలను రద్దు చేస్తూ అస్ట్రేలియా నిర్ణయం తీసుకొంది.

అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి టెక్కీలకు ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలు ఇండియన్ టెక్కీలకు, ఇండియా టెక్ కంపెనీలకు తీవ్ర నష్టాన్ని కల్గిస్తున్నాయి.

<strong>చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన </strong>చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో హమీ ఇచ్చారు. ఈ హమీ ప్రకారంగా నిర్ణయాలు తీసుకొంటున్నారు. అయితే తాజాగా అస్ట్రేలియాలో తీసుకొన్న నిర్ణయం కూడ భారత టెక్కీలకు ఇబ్బందిగా మారింది.

ఇండియా టెక్కీలకు నిరాశ

ఇండియా టెక్కీలకు నిరాశ

ఇండియన్ టెక్కీలకు మరో షాకింగ్ నిర్ణయం అస్ట్రేలియా తీసుకొంది. ఇప్పటికే అమెరికాలో ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలు ఇండియన్ టెక్కీలకు ఇబ్బందులను కల్గిస్తున్నాయి అస్ట్రేలియా ప్రభుత్వం 457 వీసాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొంది అమెరికా బాటలోనే అస్ట్రేలియా కూడ నడుస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కొత్త వీసా విధానం

కొత్త వీసా విధానం

కొత్తగా వీసా విధానాన్ని తీసుకురావాలని అస్ట్రేలియా నిర్ణయం తీసుకొంది 457 వీసాను రద్దు చేసింది. దీని స్థానంలో టెంపరరీ స్కిల్ షార్టేజ్ వీసాను తీసుకురావాలని నిర్ణయించింది. మార్చి 18 నుండి ఈ కొత్త వీసా పద్దతిని అమలు చేస్తోంది. ఈ విధానం ఇండియన్ టెక్కీలకు నష్టం కల్గిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు

అస్ట్రేలియాలో ఇండియన్ టెక్కీలే ఎక్కువ

అస్ట్రేలియాలో ఇండియన్ టెక్కీలే ఎక్కువ

అస్ట్రేలియా దేశంలో ఉన్న 90 వేల మంది విదేశీ ఉద్యోగుల్లో ఎక్కువగా ఇండియన్స్‌ ఉన్నారు. అస్ట్రేలియా అధికారిక లెక్కల ప్రకారంగా సుమారు 22 శాతం మంది ఇండియన్స్ అస్ట్రేలియాలో టెక్కీలుగా పనిచేస్తున్నారు. ఈ కొత్త విధానంతో అక్కడ పనిచేస్తున్న ఇండియన్ టెక్కీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు నిపుణులు.

 శాశ్వత నివాసం కష్టమే

శాశ్వత నివాసం కష్టమే

అస్ట్రేలియా తాజాగా తీసుకొన్న నిర్ణయంతో ఆ దేశంలో శాశ్వత నివాసం కోరుకొంటున్న ఇండియన్లకు శాపంగా పరిణమించనుంది. అవసరమైన ఉద్యోగాల్లో అవసరమైన నిపుణులను నియమించుకొనేందుకు 457 వీసా వీలు కల్పిస్తోంది. అయితే దీన్ని రద్దు చేస్తూ అస్ట్రేలియా నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం శాశ్వత నివాసం కోరుకొంటున్న ఇండియన్లకు 457 వీసా రద్దు చేస్తూ తీసుకొన్న నిర్ణయం నష్టాన్ని కల్గిస్తోంది. అయితే అవసరాన్ని బట్టి తమ దేశంలో విదేశీయులకు వర్క్ వీసాలను ఇవ్వాలని అస్ట్రేలియా నిర్ణయం తీసుకొంది.

English summary
The most popular route to Australia—the subclass 457 visa category for skilled overseas workers— has been abolished by the Australian government. Instead, a new Temporary Skill Shortage (TSS) visa has been introduced from March 18
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X