వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాక్సిన్ కంటే ముందే కరోనా మెడిసిన్ ... 48 గంటల్లోనే కరోనా వైరస్ కు చెక్ !!

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే కాకుండా,ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న కరోనా మహమ్మారి నుండి విముక్తి కోసం కరోనా వ్యాక్సిన్ తయారీకి నడుం బిగించాయి ప్రపంచ దేశాలు. కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పుడు ప్రపంచమంతా ఎదురుచూస్తున్న సందర్భంలో కరోనా వ్యాక్సిన్ కంటే ముందు ఇప్పటికే వివిధ దేశాల్లోని పలు కంపెనీలు కరోనా మెడిసిన్ ను మార్కెట్లోకి తీసుకు వచ్చాయి.

కరోనా బాధితుల కోసం ఐసీయూగా షారూక్ ఖాన్ ఆఫీస్ సిద్ధం .. దాతృత్వం చాటుకున్న రియల్ హీరోకరోనా బాధితుల కోసం ఐసీయూగా షారూక్ ఖాన్ ఆఫీస్ సిద్ధం .. దాతృత్వం చాటుకున్న రియల్ హీరో

కరోనా నిర్మూలనకు మెడిసిన్ సూచించిన సెంటర్ ఫర్ డైజెస్టివ్ డిసీజ్

కరోనా నిర్మూలనకు మెడిసిన్ సూచించిన సెంటర్ ఫర్ డైజెస్టివ్ డిసీజ్

తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన సెంటర్ ఫర్ డైజెస్టివ్ డిసీజ్ కరోనా వైరస్ ను నిర్మూలించడం కోసం ఒక మెడిసిన్ సూచించింది. ఐవర్ మెక్టిన్ అనే మెడిసిన్ తీసుకున్న 48 గంటల్లోనే అది కరోనావైరస్ ను పూర్తిగా చంపేస్తుందని సెంటర్ ఫర్ డైజెస్టివ్ డిసీజ్ మెడికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ థామస్ బోరోడి తెలిపారు. ఇది కరోనా వైరస్ పై పోరాటంలో సానుకూల ఫలితాలను అందించిందని,దీనిని వెంటనే అందరూ పరిగణలోకి తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు .

ఐవర్ మెక్టిన్ మెడిసిన్ తో 48 గంటల్లోనే వైరస్ నాశనం

ఐవర్ మెక్టిన్ మెడిసిన్ తో 48 గంటల్లోనే వైరస్ నాశనం

ఐవర్ మెక్టిన్ అనే ఈ మెడిసిన్ 1970 వ సంవత్సరం లోనే కనుగొనబడింది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ జాబితాలో కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే వినియోగించాలని, ఈ మెడిసిన్ తో పాటుగా డాక్సి సైక్లిన్ , జింక్ వంటి మరో రెండింటిని జోడించి వినియోగించాలని ఆయన పేర్కొన్నారు. ఒక్కొక్క మెడిసిన్ డోస్ 48 గంటల్లో వైరస్ ను నాశనం చేస్తుందని, దీని ప్రభావం 24 గంటల్లోనే తెలుస్తుందని అన్నారు.

అందుబాటు ధరలలోనే మెడిసిన్ ..బంగ్లాదేశ్, చైనా లలో వినియోగం

అందుబాటు ధరలలోనే మెడిసిన్ ..బంగ్లాదేశ్, చైనా లలో వినియోగం

24 గంటల్లోనే మెడిసిన్ ప్రభావంతో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని బోరోడి పేర్కొన్నారు. అందరికీ అందుబాటు ధరల్లో రెండు డాలర్ల కంటే తక్కువ ధరలోనే ఈ మెడిసిన్ దొరుకుతుందని, కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్, చైనా లలో ఈ టాబ్లెట్ ను వినియోగిస్తున్నారని, దీనితో మంచి ఫలితాలు ఉంటున్నాయని ప్రొఫెసర్, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అయిన థామస్ బోరోడీ పేర్కొన్నారు.

Recommended Video

IPL 2020 : England & Australian Cricketers Will Miss First Week of IPL | Oneindia Telugu
వ్యాక్సిన్ కంటే ముందే మార్కెట్ లో మెడిసిన్స్

వ్యాక్సిన్ కంటే ముందే మార్కెట్ లో మెడిసిన్స్

ఒకపక్క ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ తయారీ లో బిజీగా ఉన్న సమయంలో, వ్యాక్సిన్ రావడానికి మరికొంత కాలం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక రష్యా రేపు అధికారికంగా వ్యాక్సిన్ను రిలీజ్ చేస్తున్నామని చెబుతున్నా, రష్యా రిలీజ్ చేస్తున్న వ్యాక్సిన్ పై అనేక అనుమానాలున్నాయి. ఈ సమయంలో కరోనా కు మెడిసిన్ అంటూ 48 గంటల్లోనే కరోనాకు టాబ్లెట్స్ తో చెక్ పెట్టొచ్చని ఆస్ట్రేలియాకు చెందిన సెంటర్ ఫర్ డైజెస్టివ్ డిసీజ్ మెడికల్ ప్రొఫెసర్ థామస్ బోరోడి చేసిన ప్రకటన వ్యాక్సిన్ వచ్చేవరకు, ప్రజల ప్రాణాలు కాపాడటానికి అందుబాటులో ఉన్న, వివిధ అధ్యయనాల ద్వారా ప్రభావవంతంగా పని చేస్తున్నాయని నిరూపణ అయిన మందులు వినియోగించడంపై కూడా దృష్టి సారించేలా చేస్తున్నాయి.

English summary
A combination of FDA and TGA approved Ivermectin, Zinc and Doxycycline has shown positive results for COVID-19 and should be considered immediately to fight with Corona pandemic and results should be in 48 hrs says CDD Medical Director Professor Thomas Borody
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X