వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10వేల ఒంటెలను చంపాలని ప్రభుత్వం నిర్ణయం..తూటాలకు నేలకొరుగుతున్న మూగజీవాలు

|
Google Oneindia TeluguNews

సిడ్నీ: తాగేందుకు నీళ్లు లేకపోవడంతో నివాస ప్రాంతాల్లోకి భారీగా వస్తున్న ఒంటెలను చంపాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హెలికాఫ్టర్ల ద్వారా ఒంటెలను గుర్తించి వాటిని చంపేందుకు డిసైడ్ అయ్యింది. దాదాపు 10వేల ఒంటెలను చంపనున్నట్లు సమాచారం.

ఆస్ట్రేలియాలో నీటి ఎద్దడి

ఆస్ట్రేలియాలో నీటి ఎద్దడి

ఆస్ట్రేలియాలో వేసవికాలం ఉండంటంతో అక్కడ నీటి ఎద్దడి నెలకొంది. కరువు కూడా విలయతాండవం చేస్తుండటంతో నీటి కోసం వెతుకుతూ ఒంటెలు నివాసప్రాంతాల్లోకి జొరబడుతున్నాయి. అలా ఇళ్లల్లోకి చొరబడి ఈ ఒంటెలు ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేయడం, నీళ్లు తాగడం, దొరికిన ఆహారం తిని అక్కడి నుంచి వెళ్లిపోతున్నాయి. అడ్డుకునేందుకు వచ్చిన వారిపై దాడులకు తెగబడుతున్నాయని అధికారులు చెప్పారు.

నీటి కోసం ఇళ్లల్లోకి గుంపులుగా చొరబడుతున్న ఒంటెలు

నీటి కోసం ఇళ్లల్లోకి గుంపులుగా చొరబడుతున్న ఒంటెలు

ఆస్ట్రేలియా చరిత్రలో 2019వ సంవత్సరం అత్యంత కరువు సంవత్సరంగా నమోదైంది. కొన్ని పట్టణాల్లో అయితే తాగేందుకు మంచినీరు కూడా లేకుండా పోయింది. నీటి కోసం అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. అంతేకాదు ఈ మధ్యనే అక్కడ రగులుకున్న కార్చిచ్చు మరింత దారుణ స్థితికి దిగజార్చింది. దక్షిణ ఆస్ట్రేలియాలోని వాయువ్య ప్రాంతంలో 2300 మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిపై ఒంటెల దాడి ఎక్కువైందని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఒంటెలను అంతమొందించాలని డిసైడ్ అయ్యింది. దాహంతో కొన్ని ఒంటెలు మృతి చెందగా మరి కొన్ని ఒంటెలు నీటికోసం వెతుకుతూ నివాస ప్రాంతాల్లోకి వెళుతున్నాయని అధికారులు చెప్పారు.

భారత్ నుంచి పెద్ద సంఖ్యలో ఒంటెల దిగుమతి

భారత్ నుంచి పెద్ద సంఖ్యలో ఒంటెల దిగుమతి


నీరు ఉన్న పలు చోట్ల కొన్ని జంతువులు మృతి చెందడంతో ఆ నీరు కలుషితమైందని అధికారులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాకు 1840 మధ్య ప్రాంతంలో ఒంటెలు తొలిసారిగా దిగుమతి అయ్యాయి. ఆస్ట్రేలియా ఖండంను అన్వేషించేందుకు ఒంటెలను దిగుమతి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆరు దశాబ్దాలుగా ఒక్క భారత్‌ నుంచే 20వేల ఒంటెలు ఆస్ట్రేలియా దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక్క ఆస్ట్రేలియాలోనే ఒంటెల సంఖ్య అధికంగా ఉంది. ఆస్ట్రేలియాలోని ఎడారుల్లో దాదాపు 10 లక్షల వరకు ఒంటెలు సంచరిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

నివాస ప్రాంతాల్లోకి వస్తున్న ఒంటెలను మాత్రమే...

నివాస ప్రాంతాల్లోకి వస్తున్న ఒంటెలను మాత్రమే...

ఒంటెలను ప్రస్తుతం ఒక చీడపురుగుగా పరిగణిస్తోంది ఆస్ట్రేలియా ప్రభుత్వం.కరువు నెలకొన్న దృష్ట్యా అవి ఆహారం, నీరు కోసం సుదూర ప్రాంతాలకు సంచరిస్తున్నాయని ఈ క్రమంలోనే మొక్కలను, నీటి వనరులను నాశనం చేస్తున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 10వేల ఒంటెలను చంపాలని నిర్ణయించుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. నివాస ప్రాంతాల్లోకి వచ్చే ఒంటెలను మాత్రమే చంపేస్తున్నామని ఆ తర్వాత వాటి కళేబరాలను వేరే చోట కాల్చివేస్తున్నట్లు ఆస్ట్రేలియా పబ్లిక్ బ్రాడ్‌క్యాస్టర్ ఏబీసీ కథనాన్ని ప్రసారం చేసింది.

English summary
Snipers took to helicopters in Australia on Wednesday to begin a mass cull of up to 10,000 camels as drought drives big herds of the feral animals to search for water closer to remote towns, endangering indigenous communities
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X