వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్, గూగుల్ మీడియా కంటెంట్‌కు రుసుము: కీలక చట్టం చేసిన ఆస్ట్రేలియా

|
Google Oneindia TeluguNews

మెల్బోర్న్: ఆస్ట్రేలియా పార్లమెంటు కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచురించే కంటెంట్‌కు సంబంధించి మీడియా సంస్థకు రుసుము చెల్లించేలా తయారు చేసిన 'న్యూస్ మీడియా బార్గైనింగ్ కోడ్' బిల్లును ఆస్ట్రేలియా పార్లమెంటు గురువారం ఆమోదించింది. ఈ మేరకు వివరాలను ఆస్ట్రేలియా కమ్యూనికేషన్స్ మంత్రి పాల్ ఫ్లెచర్ వెల్లడించారు.

45ఏళ్లు పైబడినవారికీ కరోనా వ్యాక్సిన్, కానీ, షరతులు వర్తిస్తాయి: ఇలా చేస్తే సరిపోతుంది!45ఏళ్లు పైబడినవారికీ కరోనా వ్యాక్సిన్, కానీ, షరతులు వర్తిస్తాయి: ఇలా చేస్తే సరిపోతుంది!

తాజా చట్టంతో ఇక నుంచి ఫేస్‌బుక్, గూగుల్ సంస్థలు తమ ఫ్లాట్‌ఫాంలలో ప్రచురించే న్యూస్ కంటెంట్‌పై ఆ దేశ మీడియా సంస్థలకు రుసుము చెల్లించాల్సి ుంటుందని పాల్ తెలిపారు. దేశంలోని మీడియా మాధ్యమాలతో వాణిజ్య సంబంధాలను ఏర్పాటు చేసుకోవడంలో గూగుల్, ఫేస్‌బుక్‌లు పురోగతి సాధించడంపై సంతోషిస్తున్నామని చెప్పారు.

Australia passes landmark law requiring Facebook, Google to pay for news

మీడియా సంస్థలు తాము సామాజిక మాధ్యమాలకు ఇచ్చే కంటెంట్‌పై రెమ్యూనరేషన్ పొందడానికి ఈ కోడ్ ఉపకరిస్తుందని తెలిపారు. ఆస్ట్రేలియాలో ప్రజాప్రయోజన జర్నలిజం మరింత మెరుగవడానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని పాల్ ఫ్లెచర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. గత మూడేళ్లుగా చర్చలు, విశ్లేషణలు జరిపిన అనంతరం బిల్లును చట్టంగా మార్చింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.

అయితే, ఆస్ట్రేలియా తీసుకొచ్చిన చట్టాన్ని ఫేస్‌బుక్, గూగుల్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అంతేగాక, ఆస్ట్రేలియా వార్తలను ప్రసారం చేయడాన్ని కూడా నిలిపివేసింది. అయితే, బిల్లులు పలు సవరణలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకరించడంతో ఫేస్‌బుక్ రెండ్రోజుల క్రితం తిరిగి ఆస్ట్రేలియా వార్తలను పంచుకోవడాన్ని అనుమతించింది. కాగా, ఆస్ట్రేలియా బాటలోనే కెనడా, బ్రిటన్ లాంటి దేశాలు కూడా ఇదే తరహా బిల్లులను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వీటితోపాటు మరికొన్ని దేశాలు కూడా ఇదే రకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

English summary
Australia's parliament passed landmark legislation Thursday requiring global digital giants to pay for local news content, in a move closely watched around the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X