వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రీతిరెడ్డి హత్య కేసు: కేసును ఛేధించడంలో తలమునకలైన ఆస్ట్రేలియా పోలీసులు

|
Google Oneindia TeluguNews

ఆస్ట్రేలియాలో హత్యకు గురైన వైద్యురాలు ప్రీతిరెడ్డి కేసులో మిస్టరీ వీడలేదు. అసలు ప్రీతి రెడ్డి మృతి చెందడానికి ఏమి జరిగిందో అనేదానిపై ఆస్ట్రేలియా పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆమె హత్యకు గురికాకుముందు రెండు రోజుల ముందు నుంచే కనిపించకుండా పోయింది. అయితే పోలీసలు మాత్రం ప్రీతిరెడ్డిని తన మాజీ ప్రియుడు హర్ష హత్య చేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారాంతంలో ప్రీతి రెడ్డి ఓ సెమినార్‌కు హాజరయ్యేందుకు సిడ్నీకి వచ్చిందని అది తెలుసుకున్న హర్ష కూడా టామ్ వర్త్ నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణించి ఆమె కోసం వచ్చినట్లు వారి స్నేహితులు తెలిపారు.

Australia Police unable to trace the cause of Preethi Reddys death

అయితే సెమినార్ తర్వాత ఇద్దరు మాట్లాడుకోవడం కనిపించారని ఇద్దరి కామన్ ఫ్రెండ్ ఒకరు చెప్పారు. ప్రీతి మరొకరితో సన్నిహితంగా ఉందని తెలుసుకుని ఆమెతో మాట్లాడేందుకే టాంవర్త్ నుంచి హర్ష వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరూ బాగానే మాట్లాడుకున్నట్లు ఇద్దరికీ తెలిసిన ఓ వ్యక్తి తెలిపాడు. అనంతరం ప్రీతి రెడ్డి ఒక్కరే ఎక్కిడికో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీసీ కెమారాల్లో కినిపిస్తోంది. తనకు తెలిసిన మరో వ్యక్తితో ప్రీతిరెడ్డి అదే హోటల్‌లో బస చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఆదివారం ఉదయం ప్రీతిరెడ్డి తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు.

ఆస్ట్రేలియాలో డెంటిస్ట్ ప్రీతిరెడ్డి హత్య, సూట్‌కేసులో మృతదేహం: ప్రమాదంలో మాజీ ప్రియుడు మృతిఆస్ట్రేలియాలో డెంటిస్ట్ ప్రీతిరెడ్డి హత్య, సూట్‌కేసులో మృతదేహం: ప్రమాదంలో మాజీ ప్రియుడు మృతి

ఇదిలా ఉంటే హర్ష పోర్టర్ సహాయంతో ఓ పెద్ద సూట్‌కేసును కారులోకి ఎక్కిస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమరాల్లో రికార్డు అయినట్లు ఓ ఛానెల్ కథనం ప్రసారం చేసింది. ఆ సూట్‌కేసులోనే ప్రీతిరెడ్డి మృతదేహం ప్యాక్ చేసి ఉండొచ్చనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.అయితే ప్రీతిరెడ్డి కనిపించడం లేదన్న వార్త బయటకు రావడంతో... ప్రీతిరెడ్డి శనివారం సాయంత్రం తనతో మాట్లాడిందని ఇంటికి వెళుతున్నట్లు తనతో చెప్పినట్లు హర్ష మరొక స్నేహితుడికి మెసేజ్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఎక్కడైనా నిద్రపోయి ఉంటుందని కూడా హర్ష తన స్నేహితుడికి మెసేజ్‌ పెట్టినట్లు సమాచారం.ఇదిలా ఉంటే అప్పటికే హర్షవర్ధన్ ఆమెను హత్యచేసి ఉండొచ్చని ఆస్ట్రేలియా పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు ప్రీతిరెడ్డి, హర్షవర్ధన్ ఏం మాట్లాడుకున్నారు?, ఇద్దరి మధ్య గొడవ జరిగిందా?, హత్యకు దారితీసిన పరిస్థితులేంటి? అన్న విషయాలు మిస్టరీగా మారాయి. అక్కడేం జరిగిందో చెప్పడానికి ఎవరూ లేకపోవడంతో ఈ మిస్టరీని చేధించడానికి పోలీసులు తల ప్రాణం తోకకొస్తోంది.

మరోవైపు మృతిచెందిన ప్రీతిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాల్లో శనివారం శాంతిర్యాలీ నిర్వహించనున్నారు వైద్యులు. సిడ్నీ టౌన్ హాలు,బ్రిస్బేన్‌లోని కింగ్ జార్జ్ స్క్వేర్, మెల్‌బోర్న్‌లోని ఫెడరేషన్ స్క్వేర్‌లో క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించనున్నారు. మరో వైపు మార్చి 16న సాయంత్రం 6గంటల ప్రాంతంలో కాన్‌బెర్రాలో కూడా క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించనున్నారు.

English summary
The case of the NRI doctor Preethi reddy's death is turning out to be mysterious with the police unable to trace the cause. Police in their primary investigation expressed doubt on her former boyfriend Harsha who was also found dead in a road accident the day after he met Preethi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X