వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలేసియా విమానం గల్లంతు వెనుక కొత్త కోణం: పైలెట్ మాస్ కిల్లింగ్: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని..!

|
Google Oneindia TeluguNews

సిడ్నీ: ప్రపంచవ్యాప్తంగా విమానయాన ప్రమాదాల్లో అత్యంత దిగ్భ్రాంతిని కలిగించే ఉదంతం.. మలేసియా విమానం ఎంహెచ్-370 గల్లంతు కావడం. ఆరేళ్ల కిందట చోటు చేసుకున్న ఈ ఘటన రెండు దేశాలకు పీడకలను మిగిల్చింది. వందలాది కుటుంబాలను అనాథలను చేసింది. తమ ఆత్మీయులను కోల్పోయేలా చేసింది. విమానం గల్లంతు కావడం.. ఆరేళ్ల తరువాత కూడా దాని జాడ అనేదే తెలియరాకుండా పోవడం వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు కొత్తగా వ్యక్తమౌతున్నాయి.

మాజీ ప్రధాని సంచలన ప్రకటన..

మాజీ ప్రధాని సంచలన ప్రకటన..

ఈ అనుమానాలను వ్యక్తం చేసింది ఏ అల్లాటప్పా వ్యక్తో కాదు. సాక్షాత్తూ ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి టోని అబాట్. మలేసియా విమానం గల్లంతైన సమయంలో ఆయన ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా ఉన్నారు. గాల్లో ఉన్నట్టుండి మాయమైన విమానాన్ని అన్వేషించడానికి మలేసియా ప్రభుత్వానికి సహకరించారు. మనదేశంతో పాటు మలేసియా, చైనా, ఆప్ట్రేలియా, జపాన్ వంటి కొమ్ములు తిరిగిన దేశాలు విమానం ఆచూకీని కనుగొనడానికి బరిలో దిగినప్పటికీ. ఉపయోగం లేకుండా పోయింది.

మాస్ కిల్లింగ్‌కు పాల్పడిన పైలెట్..

మాస్ కిల్లింగ్‌కు పాల్పడిన పైలెట్..


చివరికి- ఆ విమాన ప్రయాణికులందరూ మరణించినట్లుగా ప్రకటించాల్సి వచ్చింది. ఈ విషాదకర ఘటన వెనుక కుట్ర ఉందని టోనీ అబాట్ వెల్లడించారు. పైలెట్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని, అందుకే- ఏకంగా విమానంతో పాటు సముద్రంలో దాన్ని కూల్చివేసి ఉంటాడని అభిప్రాయ పడ్డారు. తనతో పాటు 239 మంది ప్రయాణికుల ప్రాణాలను తీసుకెళ్లాడని అన్నారు. దీన్ని తాను సామూహిక హత్య (మాస్ మర్డర్స్)గా భావిస్తున్నానని చెప్పారు. స్కైన్యూస్ చిత్రీకరించిన ఓ డాక్యుమెంట్‌లో టోనీ అబాట్ ఈ విషయాన్ని వెల్లడించారు.

 మలేసియా అత్యున్నతాధికారుల నుంచి పక్కా సమాచారం..

మలేసియా అత్యున్నతాధికారుల నుంచి పక్కా సమాచారం..


మలేసియా ఎయిర్‌లైన్స్‌, ఆ దేశ పౌర విమానయానం, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన అత్యున్నత స్థాయి అధికారుల నుంచి దీనిపై తనకు పక్కా సమాచారం ఉందని టోనీ అబాట్ తెలిపారు. ఎవరి ద్వారా తనకు ఈ విషయం తెలిసిందనే సమాచారాన్ని తాను వెల్లడించలేనని అన్నారు. హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించడానికి అనుమతి లేకపోయినప్పటికీ.. ఎంహెచ్ 370 విమానం పైలెట్ ఉద్దేశపూరకంగానే.. ఆ మార్గంలో విమానాన్ని తీసుకెళ్లడాన్ని టోనీ అబాట్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Recommended Video

Excited Indigo Air Hostess Clicks Selfie With Sivan || ఇస్రో ఛైర్మన్ సింప్లిసిటీ కి నెటిజన్లు ఫిదా
నాలుగేళ్ల తరువాత..

నాలుగేళ్ల తరువాత..

మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు 239 మంది ప్రయాణికులతో 2014 మార్చి 8వ తేదీన బయలుదేరిన ఎంహెచ్-370 విమానం గమ్యస్థానాన్ని చేరలేదు. హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో అదృశ్యమైంది. ఆ విమానం ఏమైందో? ఎక్కడ కూలిందో? అందులోని ప్రయాణికులు ఏమయ్యారనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. భారత్ సహా అనేక దేశాలు అత్యాధునిక పరికరాలతో విమానాన్ని గాలించినప్పటికీ.. దాని ఆచూకీ లభించలేదు. నాలుగేళ్ల పాటు విమానం కోసం గాలించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. గాలింపు చర్యలను విరమించుకున్నాయి ఆ దేశాలు.

English summary
Australia's former Prime Minister Tony Abbott has claimed that Malaysian authorities believe the MH370 flight, which went missing with 239 people on board, was downed by the pilot in a murder-suicide plot. The Beijing bound Malaysia Airlines jet went missing on March 8, 2014, after taking off from Kuala Lumpur. "My understanding from the very top level of the Malaysian government is that from very, very early on here they thought it was a murder-suicide by the pilot," Abbott, Australia's prime minister at the time, said in a show that will air in full later on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X