వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

140 కి.మీ అడవిలో నడక, మూత్రం తాగి, చివరికిలా...

By Narsimha
|
Google Oneindia TeluguNews

మెల్‌బోర్న్: కారు ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన ఓ వ్యక్తి అడవిలో సుమారు 140 కిలోమీటర్ల దూరం నడిచాడు. తన ప్రాణాలను కాపాడుకొనేందుకు మూత్రం తాగాడు. ఎట్టకేలకు అడవి మార్గం నుండి రోడ్డుకు చేరుకోవడం, సెల్‌పోన్ సిగ్నల్స్ అందడంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు.

దక్షిణ ఆస్ట్రేలియాలోని ఉత్తర టెరిటరీ సరిహద్దులోని ఓ మారుమూల ప్రాంతంలో టెక్నీషియన్‌ గా పని చేసే థామస్ మాసోన్ (21) కొద్దిరోజుల క్రితం విధులు ముగించుకుని కారులో వెళ్తున్నాడు. ఇంతలో అతని కారుకి అడవి ఒంటెల గుంపు ఎదురొచ్చింది. ఒంటెలు ఏదైనా హాని చేస్తాయోమోన్న ఆందోళనతో కారు దారి మార్చాడు. ఆ దారి ఆస్ట్రేలియాలో మనుషులెవ్వరూ వెళ్లని ప్రమాదకర ప్రాంతం.

ఈ దిశగా చాలాదూరం వెళ్లిన తరువాత కారు ప్రమాదానికి గురైంది. మసోన్ ఈ ప్రమాదం బారి నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. కారు మాత్రం మొరాయించింది. ఫోన్ సిగ్నల్స్ లేవు. దీంతో కారులో తన వద్ద ఏమున్నాయని సరి చూసుకున్నాడు. టార్చిలైటు, దుస్తులు మినహా ఏమీలేవు.

Australian man walks 140 km after car crash, consumes urine to survive

దీంతో టార్చ్ లైట్ పట్టుకుని ఆ అడవి గుండా దారీతెన్నూ తెలియని స్థితిలో కాలినడక ప్రారంభించాడు. సుమారు 60 గంటలు నడుస్తూనే ఉన్నాడు, మధ్యలో ఆకలి వేస్తే...మూత్రంతో కడుపునింపుకున్నాడు. 140 కిలోమీటర్లు నడిచిన తరువాత ఒక హైవేను చేరుకున్నాడు.

అప్పటికే అతని తల్లిదండ్రులు అతని కోసం వెతుకులాట ప్రారంభించారు. మూడో రోజు ముగుస్తుండగా మాసోన్ రోడ్డు చేరడం, అతని ఫోన్ కు సిగ్నల్స్ రావడం, పోలీసులు అతనిని గుర్తించడం ఒకేసారి జరిగాయి. దీంతో పోలీసులు, అతనిని చేరుకుని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో ఆయనకు చికిత్స నిర్వహించారు. దీంతో ఆయన ప్రాణాలతో బయపడ్డారు.

English summary
A 21-year-old man has scripted an incredible tale of survival after crashing his car while travelling through a desolate Australian outback by walking about 140 km before getting help and drinking his own urine to stay alive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X