వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విధాత కార్ రేసర్ ని చేస్తే విధి పోర్న్​స్టార్​గా మార్చింది.!30ఏళ్ల ఇంటి రుణం 12నెలల్లో తీర్చేసింది.!

|
Google Oneindia TeluguNews

సిడ్నీ/హైదరాబాద్ : జీవితంలో కొన్ని మలుపులు అనూహ్యంగా జరిగిపోతుంటాయి. ఆ అనూహ్యం అంటే ఏంటో కొంత మంది జీవితాల్లోనే నిజరూపం దాల్చుతుంది. కొంత మంది జీవితాల్లో అనూహ్యం అదో శూన్యం గానే మిగిలిపోతుంది. అంతే కాకుండా తానొకటి తలిస్తే దైవమొకటి తలిచిందనే సామెత కూడా కొందరి జీవితాల్లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అదే మార్పు వారిలో జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చేస్తుంది. ఆస్ట్రేలియాలో ఓ అమ్మాయి జీవితంలో అచ్చం ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. వృత్తి పరంగా వచ్చే సంపాదన ఏమూలకు సరిపోకపోడంతో ఓ వినూత్న నిర్ణయం తీసుకుని ఔరా అనిపించింది ఆ ముద్దు గుమ్మ.

సన్మార్గంలో సంపాదన సరిపోకపాయె.. ఆ మార్గం ఎంచుకున్నాక అప్పులన్నీ పుటుక్కున తీరిపోయె..

సన్మార్గంలో సంపాదన సరిపోకపాయె.. ఆ మార్గం ఎంచుకున్నాక అప్పులన్నీ పుటుక్కున తీరిపోయె..

సింగిల్ నైట్ సక్సెస్.. ఎంత మంది ఈ సిద్దాంతాన్ని నమ్ముతారో అంతే మంది వ్యతిరేకిస్తారు కూడా. అరె మామా వానికి రాత్రికి రాత్రి నసీబ్ ఉల్టా పటాయించింది మామా.. ఇగ వాడు మనకు దొరుకుడు కష్టం మామా.. అని ఒక స్నేహితుడంటే అరే అట్లాంటి సక్సెస్ ఎక్కువ రోజులు ఉండదు మామా.. వాడు యాడికి పోడు.. మల్లొచ్చి మనతోని సందుల చాయ తాగుతడు చూడు.. అని మరో స్నేహితుడు వెంటనే సెలవిస్తాడు. ఇది నిత్యం జరిగిపోయే వ్యవహారం అయినప్పటికి కొందరు నిజంగానే షార్ట్ రూట్ ఎంచుకుని ఎక్కడికో వెళ్లి సందర్బాలు కూడా ఉంటాయి.

కార్ రేసర్ గా సంపాదన చాలా తక్కువ.. అదే అలాంటి సంపాదన అయితే మైండ్ బ్లాంకే..

కార్ రేసర్ గా సంపాదన చాలా తక్కువ.. అదే అలాంటి సంపాదన అయితే మైండ్ బ్లాంకే..

జీతం సరిపోతలే మామా. ఏదన్నా పార్ట్ టైమ్ చూసుకుందామనుకుంటున్నా.. ఇది కష్టపడే తత్వం ఉన్న యువతలోని సదాలోచన. అరె మామా నిజాయితీగా ఉద్యోగం చేస్తుంటే ఏం మిగులతలేదు.. ఏదన్నా చేయాలే మామా.. ప్లేట్ ఫిరాయించక పోతే కష్టం మామా.. ఇలా ఆలోచించే యువత ఎంతసేపూ అడ్డదారుల్లో తప్పుడు సంపాదన మీదనే దృష్టి కేద్రీకరిస్తారు. మరి కొంత మంది కాస్త హుందాతనంగానే సంపాదించుకుంటున్నప్పటికి ఆత్మాభిమానాన్ని మాత్రం తప్పకుండా చంపుకుంటారు. అభివృద్ది చెందిన ఆస్ట్రేలియా దేశంలో అచ్చం ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

ఆస్ట్రేలియాలో అరుదైన ఘటన.. పోర్న్ స్టార్ గా మారిన కార్ రేసర్..

ఆస్ట్రేలియాలో అరుదైన ఘటన.. పోర్న్ స్టార్ గా మారిన కార్ రేసర్..

ఆస్ట్రేలియాలో 30సంవత్సరాల రెనీ గ్రేస్ అనే యువతి వృత్తి పరంగా కార్ రేసర్. ఆస్ట్రేలియాలో మహిళా కార్ రేసర్లకు వారి వారి నైపుణ్యాన్ని బట్టి మంచి ఆదాయం కూడా ఉంటుంది. అయితే తనకెంతో ఇష్టమై రేసింగ్​ను కొన్ని అనివార్య కారణాల వల్ల వదిలేయాల్పి వచ్చింది రెనీ గ్రేస్. ఆ తర్వాత అనూహ్యంగా పోర్న్​స్టార్​గా మారింది రెనీ గ్రేస్. ప్ర‌స్తుతం ఆమె ఓన్లీఫ్యాన్స్ అనే వెబ్​సైట్​లో పలు అడ‌ల్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ వారానికి 18.8 లక్షల రూపాయలను సంపాదిస్తోంది. అయితే తాను రేసింగ్ ను వదిలి పోర్న్ ఫీల్డ్ లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఇటీవ‌ల‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. రేసింగ్​లో తాను అనుకున్న విధంగా సక్సెస్ కాలేదని, దాంతో డ‌బ్బు కూడా సంపాదించ‌లేక‌పోయానని, ఎంత‌ ప్రయత్నించినా ముందుకు వెళ్ల‌లేక‌పోవ‌డంతో రేసింగ్​ ఫీల్డ్ వ‌దిలేయాల్సి వ‌చ్చిందని వివరించింది రెనీ గ్రేస్.

పోర్న్ స్టార్ వృత్తిని సమర్ధించిన కుటుంబ సభ్యులు.. అప్పులన్నీ మటు మాయం..

పోర్న్ స్టార్ వృత్తిని సమర్ధించిన కుటుంబ సభ్యులు.. అప్పులన్నీ మటు మాయం..

అయితే పోర్న్​ స్టార్​గా మారడం తన జీవితంలో జరిగిన గొప్ప‌ మలుపుగా రెనీ అభివర్ణించింది. పోర్న్ వృత్తి తనకు ఆర్థిక ప‌రిపుష్ఠి ల‌భించేలా చేసిందని, ఈ రంగంలోకి వ‌స్తాన‌ని ముందే ఊహించ‌క‌పోయినా, ప్ర‌స్తుతం ఈ ప‌నిని ఆస్వాదిస్తున్నానని గర్వంగా చెప్తోంది రెనీ. తన వ‌ద్ద‌ ఉన్న‌ ఫొటోస్, వీడియోలు అమ్మి, 30 ఏళ్ల ఇంటి రుణాన్ని కేవలం 12 నెలల్లోనే తీర్చబోతున్నట్టు తెలిపింది. పోర్న్​ గురించి తన కుంటుంబానికి తెలుసని, తన తండ్రి తనకు అండగా నిల‌బ‌డ్డాడని రెనీ గర్వంగా ఫీల్ అవుతున్నట్టు చెప్పుకొచ్చింది. సూపర్​కార్స్​కు వ‌ర్క్ చేసిన ఫిమేల్ రేసర్ రెనీ, 2017లో రేసింగ్ రిజ‌ల్ట్స్ స‌రిగ్గా ఉండక‌పోవ‌డం, ఫండ్స్ రాకపోవడం వల్ల ఆ కెరీర్​ను వ‌దిలిపెట్టి వెళ్లింది రెనీ. ఆ తర్వాత ఓన్లీఫ్యాన్స్ వెబ్​సైట్​ గురించి తెలుసుకుంది. అందులో తన న్యూడ్ ఫొటోలు, వీడియోలు అమ్మిన మొద‌టివార‌మే 2.26 లక్షల రూపాయలను సంపాదించగలిగింది రెనీ గ్రేస్. దీంతో తన జీవితంలో జరిగిన కీలక మలుపు అనూహ్య ఫలితాన్నిస్తోందరి గర్వంగా చెప్పుకుంటోంది రెనీ.

English summary
Australian Super car racer Renee Gracie becomes porn star..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X