వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాగ్రత్త: ఫిష్ పెడిక్యూర్‌ చేయించుకున్న ఈ అమ్మాయికి ఏమైందో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

పాదాలు అందంగా ఉంచుకునేందుకు లేదా అందంగా కనిపించేందుకు మహిళలు పెడిక్యూర్ చేయించుకుంటారు. పాదాలకు చికిత్స చేయించడాన్ని పెడిక్యూర్ అంటాం. చేపలతో పెడిక్యూర్‌కు ప్రసిద్దిగాంచింది థాయ్‌లాండ్ . అలా థాయ్‌ల్యాండ్ పర్యటనకు వెళ్లిన ఓ ఆస్ట్రేలియా మహిళ అక్కడ పెడిక్యూర్ చేయించుకుంది. ఇంతవరకు బాగానే ఉంది కథ. కానీ ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. ఇంతకీ ఏమైందో తెలుసా..?

ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు చెందిన 29 ఏళ్ల విక్టోరియా విహారయాత్రకు 2010వ సంవత్సరంలో థాయ్‌లాండ్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఓ ఫిష్ స్పాకు వెళ్లి పెడిక్యూర్ చేయించుకుంది. ఆ తర్వాత ఆమె విపరీతమైన జ్వరంతో బాధపడింది. దీంతో పాటు అనేక జబ్బులు ఆమెను చుట్టుముట్టాయి. వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి చెక్ చేయించగా వైద్యులు పలు టెస్టులు చేశారు. ఆస్టియోమైలిటిస్ అనే వ్యాధితో ఆమె బాధపడుతున్నట్లు వైద్యులు డిక్లేర్ చేశారు. ఇది శరీరంలోని ఎముకలకు సంబంధించిన వ్యాధి. చాలా అరుదుగా వస్తుందని వైద్యులు చెప్పారు.

Australian Woman loses all of her toes in fish pedicure

2006లో విక్టోరియా ఫిష్ ఫుట్ స్పాను సందర్శించింది. ఆ సమయంలో అక్కడ గ్లాసు ట్యాంకు ఒకటి కిందపడిపోయి పగిలిపోయింది. అందులో కలుషితమైన నీరు ఉంది. ఆనీటిపై ఆమె నడవడంతో అప్పటికే ఆమెకు ఉన్న ఇన్ఫెక్షన్‌‌ను ఈ కలుషితమైన నీరు అంటుకుని మరింత త్రీవతరం చేసింది. 2012లో ఇన్ఫెక్షన్ మొత్తం పాదాలకు సోకకుండా... విక్టోరియా కుడి పాదానికి చెందిన బొటనవేలును ఆపరేషన్ చేసి తీసేశారు. అలా ఒక్కో వేలు తీసుకుంటూ వచ్చారు వైద్యులు. చివరి వేలును గతేడాది నవంబర్‌లో తొలగించారు వైద్యులు. ఆ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ చేపలతో పెడిక్యూర్ చేసుకోవద్దంటూ హెచ్చరించారు.

ఫిష్ ఫుట్ స్పాలో పెడిక్యూర్ ఎలా చేస్తారు..?
నీళ్లున్న టబ్‌లో చిన్న చేపలను వదులుతారు. వాటిని గర్రారూఫా అని పిలుస్తారు. దీన్నే డాక్టర్ ఫిష్అని కూడా అంటారు. ఈ చేపలున్న టబ్‌లో పాదాలు ఉంచాలి. ఆ సమయంలో చేపలు పాదాల చెంతకు చేరి నిర్జీవమైన చర్మాన్ని తీసేస్తాయి. అంతేకాదు పాదాలకు అంటుకున్న మలినాన్ని తొలగించేస్తాయి. అయితే ఆరోగ్య దృష్ట్యా, జంతుప్రేమికులను దృష్టిలో ఉంచుకుని ఫిష్ పెడిక్యూర్‌పై అమెరికా, కెనడా, యూరప్‌లోని పలుదేశాల్లో నిషేధం విధించారు.

English summary
An Australian woman did not anticipate the danger of treating herself to fish pedicure whilst her trip to Thailand and had to amputate all the toes on her right foot. Victoria Curthoys, 29, from Perth, Australia, Australia, contracted an infection after she visited fish spa on a holiday in Thailand in 2010. Soon she suffered from constant fevers and other illnesses and after undergoing several tests, she was diagnosed with osteomyelitis - a rare and serious condition involving infection of the bone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X