• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వామ్మో డేంజర్ స్పాట్.. అక్కడకు వెళితే ప్రాణాలు పోతున్నాయి..!

|

ఆస్ట్రేలియా : అక్కడకు వెళితే కచ్చితంగా ప్రాణాలు పోతాయి.. అయినా టూరిస్టులు అక్కడకు క్యూ కడుతున్నారు. మోస్ట్ డేంజరస్ ప్లేస్ అని తెలిసినా.. ప్రాణాలకు తెగించి వెళుతున్నారు. ఇంతకు అక్కడ ఏముంది.. ప్రాణాలు ఎందుకు పోతాయి. టూరిస్ట్ ప్లేస్‌కు వెళితే జనాలు ఎందుకు చనిపోతారు. ఇలాంటి ప్రశ్నలు చుట్టుముడుతున్నా.. టూరిస్టులు మాత్రం అక్కడకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు.

ఆస్ట్రేలియాలో మోస్ట్ డేంజరస్ ప్లేస్‌గా విట్టెనూమ్ చరిత్ర పుటల్లోకి ఎక్కినా.. అక్కడకు వెళ్లే టూరిస్టులు మాత్రం ఆగడం లేదు. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా.. ఒకవేళ ప్రాణాపాయం తప్పినా.. అంతు లేని రోగాలు శరీరాన్ని పట్టిపీడిస్తాయని తెలిసినా డోంట్ కేర్ అంటున్నారు.

కొత్త కట్టడాలు ఏంటో గానీ.. అయ్యా కేసీఆర్ అది కూడా వదలరా..!

ప్రాణాలంటే లెక్క లేదా..!

ప్రాణాలంటే లెక్క లేదా..!

ఎవరైనా ప్రాణాలు కాపాడాలనుకుంటారు.. ప్రాణాల మీదకొస్తే భయపడతారు. అనవసరంగా ప్రాణాలైతే తీసుకోరు. కానీ కొందరు ప్రాణాలతో చెలగాటమాడుతూ అదేదో ఘనకార్యంలా ఫీలవుతారు. తీరా ప్రాణాలు పోతే గానీ అసలు విషయం బోధపడదు. ఆ క్రమంలో పశ్చిమ ఆస్ట్రేలియాలోని విట్టెనూమ్‌ ప్రాంతానికి టూరిస్టులు క్యూ కడుతున్నారు.

టూరిస్ట్ ప్రాంతానికి వెళితే ప్రాణాలు పోవడమేంటనే డౌట్ రావొచ్చు. దయ్యాలు, భూతాలు కూడా లేనిచోట ప్రాణాలు ఎందుకు పోతాయని అనుమానం కలగొచ్చు. కానీ అక్కడ విషపూరితమైన వాయువులు ఉన్నాయి. అక్కడి గాలి విషతుల్యం కావడంతోనే డేంజర్ స్పాట్‌గా గుర్తింపు పొందింది. ఏ మాత్రం కంటికి చిక్కని ఆరు రకాల సహజ సిద్ధమైన ఖనిజాల మిశ్రమమైన అస్బెస్టాస్ వాయువే ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది.

ఆ వాయువులు ప్రాణాలు తోడేస్తున్నాయి..!

ఆ వాయువులు ప్రాణాలు తోడేస్తున్నాయి..!

సదరు అస్బెస్టాస్ వాయువు పీల్చుకుంటే స్పాట్‌లో చనిపోతారు. వాటిని పీల్చుకున్నవారు పక్కవారిని హెచ్చరించేలోపే వారు ప్రాణాలు విడుస్తారు. ఒకవేళ కొందరికి ప్రాణాపాయం తప్పినా.. చివరకు శ్వాసకోస సంబంధిత వ్యాధులతో పాటు లంగ్స్ క్యాన్సర్ తదితర వ్యాధులతో నరకం అనుభవిస్తారు.

పోర్ట్‌ హెడ్‌లాండ్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఈ డేంజర్ స్పాట్ ఉంది. ప్రాణాలను హరించే ఈ ప్రాంతానికి పర్యాటకులు క్యూ కడుతుండటం గమనార్హం.

ఈ ప్రాంతంలో 1966వ సంవత్సరంలో అస్బెస్టాస్‌ గనుల తవ్వకాలను ఆపేశారు. అయితే గాలిలోకి లీకైన అస్బెస్టాస్‌ వాయువుల వల్ల కార్మికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. అలా దాదాపు 30 లక్షల టన్నుల అస్బెస్టాస్‌ నిల్వలు ఉన్నప్పటికీ గనులను మూసివేశారు. అంతేకాదు దాని సమీపంలోని గ్రామ ప్రజలను కూడా ఖాళీ చేయించారు.

హెచ్చరిక బోర్డుల దగ్గర ఫోటోలకు ఫోజులు

హెచ్చరిక బోర్డుల దగ్గర ఫోటోలకు ఫోజులు

అదలావుంటే ఈ ప్రాంతంలో ఇప్పటికి ఆ విష వాయువులు రాజ్యమేలుతూనే ఉన్నాయి. టూరిస్టులు రావొద్దంటూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినా కూడా ఫలితం లేకుండా పోతోంది. జనాలు క్యూ కడుతూనే ఉన్నారు. హార్రర్ సినిమాను తలపించే ఈ టూరిస్ట్ స్పాట్‌కు పర్యాటకులు పెరుగుతూనే ఉన్నారు. ఆ కాలం నాటి పాడు పడిన ఇళ్లు, దుకాణాలు అలాగే శిథిలావస్థలో ఉన్నాయి. పర్యాటకులు ఎంత వద్దన్నా.. హెచ్చరిక బోర్డుల దగ్గరకు వెళ్లి కూడా ఫోటోలకు ఫోజులు ఇస్తుండటం గమనార్హం. అలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక వాటి సమీపంలోని ఓ సరస్సులో జలకాలాడుతూ విషతుల్యమైన వాటర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు.

ఓట్లేశాం.. మరి పసుపు బోర్డేది నాయనా.. ఎంపీ అర్వింద్ తీరుపై ఆగ్రహం..!

కరెంట్ కట్ చేశారు.. అయినా గుడారాలు వేసుకుని..!

కరెంట్ కట్ చేశారు.. అయినా గుడారాలు వేసుకుని..!

పర్యాటకులు ఇక్కడకు రాకుండా అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. విద్యుత్ సరఫరా నిలిపివేసినా కూడా టూరిస్టులు మాత్రం వెళ్లడం ఆపట్లేదు. ఈ డేంజరస్ ప్లేస్ ఒకటుందనే విషయం ఎవరికీ తెలియొద్దనే ఉద్దేశంతో నెట్టింట్లో ఎలాంటి మ్యాపులు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా జనాలు వెళుతూనే ఉన్నారు. సోషల్ మీడియా కూడా దానికి ఓ కారణంలా మారింది. సరాదాగా వెళ్లడానికి స్నేహితులే కాదు ఫ్యామిలీలు సైతం వెళుతుండటం గమనార్హం. ఇంకో ట్విస్ట్ ఏంటంటే టెంట్లు, గుడారాలు వేసుకుని రాత్రి సమయాల్లో కూడా ఇక్కడే సేదదీరుతున్నారట.

English summary
It has been described as one of the most dangerous and contaminated places on the planet. But that notoriety has become a tourist drawcard for the toxic ex-asbestos mining town of Wittenoom, deep in Western Australia's remote Pilbara region. About 20,000 people lived there in its heyday throughout the 1930s to 1966, carting around deadly blue asbestos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X