వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ సీరియస్ వార్నింగ్!: ఇండియాకు నష్టమేనా..!

ఇతర దేశాల్లో తమ కంపెనీలను విస్తరించాలనుకుంటే 35శాతం పన్ను తప్పదన్న ట్రంప్ ప్రటకన.. భారత ప్రభుత్వం 'మేక్ ఇన్ ఇండియా' ఆశయాలకు ప్రతిబంధకంగా మారిందనే చెప్పాలి.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : అమెరికన్ అధ్యక్ష ఎన్నికల సందర్బంగా.. భారతీయులు, చైనీయులు మన ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ అక్కడి యువతను రెచ్చగొట్టిన ఆ దేశ 45వ అధ్యక్షుడు ట్రంప్.. తాజాగా సంచలన ప్రకటన చేశారు. అమెరికన్ కంపెనీల్లో విదేశీయులను ప్రోత్సహించినా.. ఇతర దేశాల్లో కొత్త యూనిట్‌ లు నెలకొల్పినా.. ఆయా కంపెనీల ఉత్పత్తులపై 35శాతం పన్ను తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.

అమెరికాలో పరిశ్రమలు పెట్టి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేవారికి మాత్రం పన్ను విషయంలో వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఆదివారం నాటు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు ట్రంప్. వరుస ట్వీట్ల ద్వారా అమెరికాలో వ్యాపార కార్యకలాపాల గురించి ఆయన స్పందించారు. అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించినా.. ఔట్ సోర్సింగ్ పద్దతిలో విదేశీయుల్ని కంపెనీల్లో నియమించుకున్నా.. భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు.

తమ యూనిట్లను విదేశాలకు తరలించే కంపెనీలపై కూడా 35శాతం పన్ను తప్పదని తేల్చి చెప్పారు. ఇంతటి మూల్యంతో కూడుకున్న తప్పిదాన్ని అమెరికన్ కంపెనీలు చేయవనే ఆశిస్తున్నానని ఆయన పేర్కొనడం గమనార్హం.

ఇండియాకు నష్టమేనా!

ట్రంప్ చేసిన ఈ ప్రకటన భారత ప్రభుత్వం 'మేక్ ఇన్ ఇండియా' ఆశయాలకు ప్రతిబంధకంగా మారిందనే చెప్పాలి. ఇతర దేశాల్లో తమ కంపెనీలను విస్తరించాలనుకుంటే 35శాతం పన్ను తప్పదని అమెరికన్ కంపెనీలను ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో.. అక్కడి కంపెనీలు ఇండియాలో తమ సంస్థల విస్తరణపై సందిగ్ధంలో పడ్డట్టయింది.

English summary
US President-elect Donald Trump warned of imposing a whopping tax of 35 per cent on products made by American companies that either outsource jobs overseas or build a new factory in another country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X