వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాగ్దాది వారసుడిని కూడా మట్టుబెట్టాం: డొనాల్డ్ ట్రంప్ ట్వీట్

|
Google Oneindia TeluguNews

సిరియాలో నక్కిన ఐఎస్ చీఫ్ బాగ్దాదిని అమెరికా సేనలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అగ్రరాజ్య అధినేత ట్రంప్ కూడా మీడియాకు వివరించారు. అయితే బాగ్దాదితోపాటు ఆయన వారసుడిగా ప్రకటించే ఉగ్రవాదిని కూడా మట్టుబెట్టామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అయితే దీనిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

అబుబకర్ ఆల్ బాగ్దాది చనిపోయిన తర్వాత ఐఎస్ చీఫ్ ఎవరు అవుతారనే అంచనాలు నెలకొన్నాయి. ఆ పోస్టు కోసం బాగ్దాది అధికార ప్రతినిధి, కుడిభుజం అబు హసన్ ఆల్ ముహజిర్ పేరు సహా మరికొందరి పేర్లు వినిపించాయి. ఆదివారం ఐన్-ఆల్-బేదలో అమెరికా సేనలు అతనిని కూడా మట్టుబెట్టారు. అయితే ట్రంప్ అతనిని ఉద్దేశించి ట్వీట్ చేశాడా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై వైట్ హౌస్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో స్పష్టత కొరవడింది.

Baghdadi’s top replacement also killed by US troops:trump

ట్రంప్ ట్వీట్‌కు వైట్ హౌస్ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే కుర్దీస్ సేనలు మాత్రం నిజమేనని అంగీకరించాయి. కుర్దీష్‌కు సంబంధించి ఎస్డీఎఫ్ కమాండర్ మజ్‌లోమ్ అబ్దీ మాత్రం ముహజిర్ చనిపోయాడని తెలిపారు. అమెరికా సేనల సహయంతో ఎస్డీఎఫ్ ఆర్మీ మట్టుబెట్టిందని పేర్కొన్నారు. వాయవ్య సిరియాలో అమెరికా సేనలు దాడులు నిర్వహించి హతమార్చాయని పేర్కొన్నారు. దీంతో ట్రంప్ చెప్పిన బాగ్దాది వారసుడు ముహజిర్ అని అర్థమవుతుంది.

English summary
US President Donald Trump said on Tuesday the person likely to be first in line to replace Islamic State’s slain leader Abu Bakr al-Baghdadi has also been “terminated.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X