వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీరవ్ ‌ మోడీకి మళ్లీ నిరాశే... బెయిల్ తిరస్కరించిన లండన్ కోర్టు

|
Google Oneindia TeluguNews

లండన్ : ఆర్థిక నేరగాడు వజ్రాల వ్యాపారి అయిన నీరవ్ ‌మోడీకి యూకే కోర్టులో మళ్లీ నిరాశే ఎదురైంది. బెయిల్ ఇవ్వాల్సిందిగా కోర్టును ఆశ్రయించిన నీరవ్ మోడీకి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. దీంతో ఆగష్టు 22వ తేదీ వరకు నీరవ్ మోడీ జైలుకే పరిమితం కావాల్సి వచ్చింది. వీడియో కాన్ఫిరెన్సింగ్ ద్వారా నీరవ్ మోడీని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ చేసింది. అనంతరం బెయిల్ మంజూరు చేయడం లేదని చెబుతూ ఆగష్టు 22 వరకు రిమాండ్ కొనసాగించేలా ఆదేశాలు జారీ చేసింది.

సౌత్ వెస్ట్ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ప్రస్తుతం నీరవ్ మోడీ ఉన్నాడు. పంజాబ్ నేషనల్‌ బ్యాంకుకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఎగవేసి లండన్ పారిపోయాడు. ఈ నెల తొలివారంలో అతని బెయిల్ తిరస్కరణకు గురయ్యాక మళ్లీ ఇంతకాలనికి విచారణకు హాజరయ్యాడు. నీరవ్ మోడీని స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు ఈ ఏడాది మార్చి 19న అరెస్టు చేశారు. ఇక అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.

Bail once again rejected to Nirav Modi by UK court, to stay in Jail till August 22nd

ఇక విచారణ సందర్భంగా నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కొన్ని వేల కోట్లు ఎగొట్టారని భారత్ తరపున వాదించిన న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నీరవ్ మోడీని భారత్‌కు రప్పించేందుకు ఇక్కడి విచారణ సంస్థలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. జూన్ 27న స్విస్ అధికారులు మోడీకి సంబంధించి రూ.283.16 కోట్లను సీజ్ చేశారు. ఇక జూలై 2న సింగపూర్‌లో ఉన్న మోడీ ఖాతాలు నాలుగింటిని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ ఖాతాల్లో రూ.44 కోట్లు ఉన్నట్లు సమాచారం. మరోవైపు నీరవ్ మోడీ సోదరి పూర్వీ ఆమె భర్త మయాంక్‌లపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది ఇంటర్‌పోల్.

English summary
A UK court has remanded fugitive Indian diamantaire Nirav Modi to judicial custody till August 22. He appeared before the Westminster Magistrates' Court via videolink from the Wandsworth prison on Thursday for the hearing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X