వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోబెల్ బహుమతి గెలుచుకున్న ఆరవ కపుల్ అభిజీత్ బెనర్జీ-ఎస్తేర్ డఫ్లో

|
Google Oneindia TeluguNews

స్టాక్‌హోం: నోబెల్ ప్రైజ్ ఒకరికి దక్కడమే చాలా గొప్ప అని భావిస్తారు. అదే ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి దక్కితే అది నిజంగానే అద్భుతమైన ఘట్టం అని భావించాల్సి ఉంటుంది. అదే సోమవారం జరిగింది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్‌ జ్యూరీ పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం ప్రకటించిన నోబెల్ ప్రైజ్‌లకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వడం ప్రారంభించి 50 ఏళ్లు గడిచాయి. ఈ 50 ఏళ్లల్లో ఇద్దరు మహిళలకు మాత్రమే ఈ అవార్డు దక్కింది. అందులో ఎస్తేర్ డఫ్లో రెండవ మహిళగా చరిత్ర సృష్టించింది. మరొక ప్రత్యేకత ఏమిటంటే నోబెల్ పురస్కారాలు అందుకున్న దంపతుల్లో అభిజీత్-ఎస్తేర్ డఫ్లో దంపతులు ఆరవ కపుల్‌గా నిలిచారు.

Recommended Video

#NobelPrize2019 : Abhijit Banerjee Nobel Prize Winner In Tihar Jail || Oneindia Telugu
మేరీ క్యూరీ- పియరీ క్యూరీ

మేరీ క్యూరీ- పియరీ క్యూరీ

భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్యశాస్త్రం, సాహిత్యం, ఆర్థిశాస్త్రం శాంతిరంగాల్లో విశేష కృషి చేసిన వారిని గుర్తిస్తూ నోబెల్ పురస్కారాలు అందిస్తారు. అయితే ఈ నోబెల్ బహుమానాలు పొందిన దంపతుల్లో మొదటిగా మేరీ క్యూరీ, పియరీ క్యూరీలు నిలిచారు. మేరీక్యూరీ పియరీ క్యూరీలు రేడియం పరిశోధనల్లో విశేష కృషి చేసినందుకుగాను ఈ దంపతులకు 1903లో నోబెల్ పురస్కారం దక్కింది.

 ఫ్రెడెరిక్ జోలియట్ - ఇరీన్ జోలియట్

ఫ్రెడెరిక్ జోలియట్ - ఇరీన్ జోలియట్

రేడియో యాక్టివ్ ఐసోటోప్‌లను దక్కించుకున్న వారిలో ఫ్రెడెరిక్ జోలియట్, ఇరీన్ జోలియట్ క్యూరీ దంపతులకు 1935లో రసాయనశాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది.

కార్ల్ కోరీ - గెర్టీ కోరీ

కార్ల్ కోరీ - గెర్టీ కోరీ

వైద్యశాస్త్రంలో క్యాటలిటిక్ కన్వర్షన్ ఆఫ్ గ్లైకోజెన్‌ ఎలా జరుగుతుందో అనే ప్రక్రియను కనుగొని 1947లో మెడిసిన్ రంగంలో కార్ల్ కోరీ మరియు గెర్టీ కోరీలు నోబెల్ పురస్కారాలను అందుకున్నారు.

అల్వా మైడ్రల్- గున్నార్ మైడ్రల్:

అల్వా మైడ్రల్- గున్నార్ మైడ్రల్:

అల్వా మైడ్రల్ మరియు గుర్రార్ మైడ్రల్‌లు 1974లో ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. ఆర్థికం సామాజికం రాజకీయ విధానాలపై వీరు చేసిన కృషికిగాను నోబెల్ వరించింది. 1982లో అల్వాకు నోబెల్ శాంతి పురస్కారం కూడా లభించింది. అణ్వాయుధాల వినియోగంను తగ్గించేలా కృషి చేసినందుకుగాను ఆమెకు శాంతిపురస్కారం లభించింది.

ఎడ్వార్డ్ మోసర్ - మే బ్రిట్:

ఎడ్వార్డ్ మోసర్ - మే బ్రిట్:

2014లో వైద్యశాస్త్రంలో ఎడ్వార్డ్ మోసర్ మరియు మే బ్రిట్ దంపతులకు నోబెల్ పురస్కారం దక్కింది. వీరు మెదడులో కణాలకు ఒక స్థాన వ్యవస్థ ఉంటుందని కనుగొన్నారు. దీన్ని మరింత క్లుప్తంగా అంతర్గత జీపీఎస్ గా పిలిచారు.

ఇలా అభిజీత్ బెనర్జీ ఎస్తేర్ డఫ్లోలు ఆర్థికశాస్త్రంలో సంయుక్తంగా నోబెల్ పురస్కారాలు దక్కించుకున్న ఆరవ దంపతులుగా చరిత్ర సృష్టించారు.

English summary
Winning a nobel prize is a rare honor in itself. It makes it even more special when you and your life partner achieve this feat holding hands together. Today, Abhijit Banerjee and Esther Duflo became the sixth couple to get the Nobel Prize together.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X