• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రమాదంలో బ్యాంకాక్: ముంపు ముప్పు, భారీ భవనాలు సహా కారణాలు ఇవే

By Srinivas
|
  సముద్రమట్టానికి దిగువన బ్యాంకాక్...షాకింగ్ నిజాలు....!

  బ్యాంకాక్: సముద్రమట్టం క్రమంగా పెరుగుతుండటంతో భవిష్యత్తులో బ్యాంకాక్ మునిగిపోయే ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. వాతావరణ మార్పులపై చర్చలకు బ్యాంకాక్ సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో ఈ పర్యాటక ప్రాంతం మునిగిపోబోతుందన్న సమాచారం వాతావరణ పరిస్థితుల్లోని మార్పుల తీవ్రతను తెలియజేస్తోంది.

  ఆందోళన కలిగించే నివేదిక

  ఆందోళన కలిగించే నివేదిక

  ఈ ఏడాది చివరలో పోలండ్‌లో ఐక్య రాజ్యసమితి వాతావరణ మార్పులకు సంబంధించిన కీలక శిఖరాగ్ర సదస్సు జరగనుంది. గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను ఏ మేరకు తగ్గించాలి, దుర్బలమైన దేశాలకు సాయం ఎంతవరకు అందించాలనే అంశాలపై సన్నాహక సమావేశాలు బ్యాంకాంక్‌లో ఇటీవల మొదలయ్యాయి. ఈ సమయంలో వరల్డ్ బ్యాంక్ నివేదిక ఒకటి ఆందోళన కలిగిస్తోంది.

  సముద్రమట్టానికి దిగువన బ్యాంకాక్

  సముద్రమట్టానికి దిగువన బ్యాంకాక్

  ఆ నివేదిక ప్రకారం... వాతావరణ మార్పుల కారణంగా 2030 నాటికి బ్యాంకాంక్‌లో దాదాపు నలభై శాతం భూభాగం నీట మునిగిపోతుందట. ప్రస్తుతం బ్యాంకాక్‌ ఏటా ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల చొప్పున మునుగుతోంది. భవిష్యత్తులో భారీ వరద ముంపు పొంచి ఉందని గ్రీన్‌పీస్‌ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. గల్ఫ్‌ ఆఫ్‌ థాయ్‌లాండ్‌ సముద్ర తీరమట్టం ప్రపంచ సగటు కంటే ఏటా నాలుగు మిల్లీ మీటర్ల చొప్పున ఎక్కువగా పెరుగుతోంది. బ్యాంకాక్ ఇప్పటికే సముద్రమట్టం కంటే దిగువన ఉంది.

   కారణాలు ఇవీ

  కారణాలు ఇవీ

  ఏడేళ్ల క్రితం రుతుపవనాల వల్ల భారీ వర్షాలు పడేసరికి బ్యాంకాక్ అయిదో వంతు భాగం నీట మునిగింది. అప్పట్లో ఒక్క బిజినెస్‌ డిస్ట్రిక్ట్ మాత్రం బయటపడినా మిగతా థాయ్‌లాండ్‌లో వరదలు పోటెత్తి సుమారు వందలాది మంది చనిపోయారు. అడ్డు అదుపు లేని పట్టణీకరణ, తీరప్రాంత కోత, ఆకాశహర్మ్యాల భారం తదితర వాటి వల్ల మునిగిపోవడానికి కారణంగా ఉందని అంటున్నారు. భారీ భవనాల కారణంగా బ్యాంకాక్ నెమ్మదిగా నీళ్లలో ఒరిగిపోవడానికి మరో కారణంగా చెబుతున్నారు.

  ఇలా చేయాల్సిందే

  ఇలా చేయాల్సిందే

  నీటి తరలింపునకు ఉన్న సహజ వ్యవస్థను రోడ్లతో మూసివేయంతో ముప్పు ముంచుకు వస్తోందని చెబుతున్నారు. సముద్ర ఆటుపోట్ల నుంచి రక్షణ కల్పించే మడ అడవులను రొయ్యల సాగు పేరుతో ధ్వంసం చేయడం వల్ల తీరం ప్రాంతం కోత పడుతోందని చెబుతున్నారు. భూయాజమాన్యంపై స్పష్టమైన విధానం ఉంటేనే దీనిని తగ్గించవచ్చునని చెబుతున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  As Bangkok prepares to host climate-change talks, the sprawling city of more than 10 million is itself under siege from the environment, with dire forecasts warning it could be partially submerged in just over a decade.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more