• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

150మంది మహిళలతో: అత్యంత జుగుప్సగా.. 'సెక్స్ సుల్తాన్' పేరుతో ఇలా?

|

ఢాకా: పోర్నోగ్రఫీ నిషేధం కొనసాగుతున్న బంగ్లాదేశ్ లో 'సెక్స్ సుల్తాన్' పేరిట కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో పోర్న్ వీడియోలు దర్శనమివ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. తనను తాను సెక్స్ సుల్తాన్‌గా అభివర్ణించుకున్న ఓ వ్యక్తి.. దాదాపు 150మంది మహిళలతో సాగించిన తన రాసలీలల బాగోతాన్ని వీడియోల ద్వారా బయటపెడుతూ వస్తున్నాడు. ఈ వీడియోలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తన చేతికి చిక్కిన మహిళలను లోబర్చుకుని వీడియోలతో వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడు. అలా వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు గుంజేవాడు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోల్లో ముఖానికి ఓ మాస్క్ ధరించి ఇతను కనిపిస్తున్నాడు. సుల్తాన్ వీడియోలకు బంగ్లాదేశ్ లో చిన్నా-పెద్ద తేడా లేకుండా చాలామంది ఆకర్షితులవడంతో.. అక్కడి ప్రభుత్వం విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.

Bangladesh's 'Sultan Of Sex' Detained On Blackmail Charges

ఎవరా ఈ సుల్తాన్? అని ఆరా తీస్తే.. ఫౌద్ బిన్ సుల్తాన్ అనే ఓ రియల్ ఎస్టేట్ అని తేలింది. ఢాకాలోని అతని ఇంటిపై గురువారం దాడి చేసిన పోలీసులు పెద్ద ఎత్తున పోర్నోగ్రఫీ వీడియోలు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. యాంటీ పోర్నోగ్రఫీ చట్టం కింద అతన్ని అరెస్టు చేశారు. నేరం రుజువైతే అతనికి 10ఏళ్ల జైలు శిక్షపడే అవకాశం ఉందంటున్నారు.

అయితే తానెవరిని మోసం చేయలేదని, తన దగ్గరికి వచ్చిన మహిళలంతా స్వచ్చందంగా, అన్నీ తెలిసే వచ్చారని సుల్తాన్ చెబుతుండటం గమనార్హం. కాగా, గడిచిన కొద్ది నెలలుగా బంగ్లాదేశ్‌లో సుల్తాన్ పేరు మారుమోగుతూనే ఉంది. అతని వీడియోలను యువత ఎగబడి చూస్తుండటంతో సుల్తాన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.

English summary
Bangladesh police have arrested a self-proclaimed "Sultan of Sex" accused of blackmailing dozens of women with intimate videos he filmed of their sexual encounters, an official said Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X