వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాసన్ చార్‌కు రోహింగ్యాలు, శాటిలైట్ ఇమేజేస్ ఇవిగో.. లక్ష మంది వరకు, కానీ ఆందోళన..

|
Google Oneindia TeluguNews

రోహింగ్యాల‌ను బంగా‌ళాఖాతంలోని భాస‌న్ చార్‌కు బంగ్లాదేశ్ పంపిస్తోంది. భద్రతా కారణాల వల్ల బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం రోహింగ్యాలను కాక్స్ బజార్‌లో ఆశ్రయం కల్పించింది. బంగా‌ళాఖాతంలో డెల్టా అవక్షేపాలతో ఏర్పడిన భాసన్ చార్ ప్రాంతంలో రోహింగ్యాల కోసం విడిదిని ప్ర‌భుత్వం సిద్ధం చేసింది. కాక్స్‌ బజార్ నుంచి బంగ్లాదేశ్‌లోని నోఖాలి జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాసన్ చార్‌కు లక్ష మంది రోహింగ్యా శరణార్థులను పంపిస్తోన్నామని అధికారులు తెలిపారు.

రోహింగ్యాలు స్వదేశం మయన్మార్‌కు వెళ్తే తప్ప వారిని భాసన్ చార్‌ విడిచిపెట్టేందుకు అనుమతించకూడ‌ద‌ని నిర్ణ‌యించారు. భాసన్ చార్ ద్వీపాన్ని 14-15 సంవత్సరాల క్రితం గుర్తించారు. కాక్స్ బజార్‌లోని రోహింగ్యాల భారాన్ని తగ్గించాలని షేక్ హసీనా ప్రభుత్వం నిర్ణయించిన తరువాత.. బంగా‌ళాఖాతంలోని భాసన్ చార్ ద్వీపంలో సౌకర్యాలను నిర్మించడం ప్రారంభించింది.

Bangladesh shifting Rohingyas to Bhasan Char island that lacks basic facilities, reveal satellite images

చైనాతో పాటు విదేశీ నిర్మాణ సంస్థలతో ఆశ్రయ గృహాలు, ద‌వాఖాన‌లు, ప‌రిపాల‌నా భ‌వ‌నాలు, ప్రార్థ‌నా మందిరాల‌ను కూడా ప్రభుత్వం నిర్మించింది. రోహింగ్యాల మొదటి బ్యాచ్ గత వారం నౌకల్లో భాసన్ చార్ ద్వీపానికి చేరుకుంది. చిట్టగాంగ్ నౌకాశ్రయం బంగ్లాదేశ్ నుంచి మరిన్ని పడవలు రాబోయే కొద్ది రోజుల్లో వీరిని త‌ర‌లించేందుకు సిద్ద‌మ‌వుతున్నాయి. అయితే కాక్స్ బజార్ శిబిరాల్లో ఎనిమిది లక్షలకు పైగా రోహింగ్యాలు ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కానీ సంఖ్యపై మాత్రం స్పష్టత లేదు

రోహింగ్యాల తరలింపునకు సంబంధించి ఉపగ్రహ చిత్రాలు కనిపించాయి. బాసన్ చార్ వద్దకు పంపించే ఫోటోలు ఆగుపించాయి. 2017 మే నుంచి శరణార్థుల తరలింపు ప్రక్రియ ప్రారంభించారు. అయితే అదీ ఇప్పటికీ కొనసాగుతోంది. తాజా తరలింపునకు సంబంధించిన శాటిలైట్ ఫోటోలను ఇండియా టుడే వార్తా సంస్థ పోస్ట్ చేసింది.

ద్వీపంలో సరైన సౌకర్యాలు ఉన్నయా లేదా అనే అంశంపై ఆందోళన నెలకొంది. ప్రభుత్వ చర్యను మానవ హక్కుల సంఘాలు, మేధావులు వ్యతిరేకిస్తున్నారు. ద్వీపంలో శరణార్థులకు ఆహారం, నీరు, వైద్యం, సంరక్షణ, విద్య సౌకర్యలు లభిస్తాయా అని అడుగుతున్నారు.

English summary
Bangladesh has begun moving Rohingya families from refugee camps near Ukhia in Cox's Bazar district of Bangladesh to Bhasan Char.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X