వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగ్లా కూడ మనవైపే... కశ్మీర్, భారత అంతర్గత అంశమని ప్రకటించిన బంగ్లాదేశ్

|
Google Oneindia TeluguNews

కశ్మీ,ర్ వివాదంపై పోరుగు దేశమైన బంగ్లాదేశ్ మద్దతు కూడ పాకిస్థాన్ కూడగట్టలేక పోయింది. పాకిస్థాన్ చేస్తున్న ఆగడాలకు బంగ్లాదేశ్ మద్దతు పలకలేదు. ఈ నేపథ్యంలోనే కశ్మీర్ వివాదంపై బంగ్లాదేశ్ భారత్‌కు మద్దతు పలికింది. కశ్మీర్ వివాదం భారత దేశ అంతర్గత వ్యవహారం అంటూ బహిరంగగానే మద్దతు తెలిపింది. ఆర్టికల్ 370 రద్దును భారత అంతర్గత వ్యవహారంగా భావిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

అంతేకాకుండా ప్రాంతీయ సుస్థిరత, శాంతి, అన్ని దేశాల అభివృద్ధిని తమ దేశం కోరుకుంటోందని వెల్లడించింది. దీంతో ఇన్నాళ్లు ప్రపంచదేశాల మద్దతు కోసం పాకులాడిన పాకిస్థాన్‌కు పక్క దేశం కూడ మద్దతు లభించకపోవడంతో భారత్‌కు మరింత విజయం చేకూరినట్లయింది.

Bangladesh support for Indias move on Jammu and Kashmir,

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్స్‌ను రద్దు చేయడంతో కశ్మీర్ రాష్ట్ర విభజన చేయడంతో పాకిస్థాన్ కయ్యానికి కాలు దువ్వుతున్న విషయం తెలిసిందే... పాకిస్థాన్ భావించినట్టు కశ్మీర్‌లో ప్రశాంత వాతవరణం నెలకోడంతో పాటు పాకిస్థాన్ ఊహించినట్టు ఎలాంటీ హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోలేదు.

దీంతో కశ్శీర్ అంశాన్ని అంతర్జాతీయ సమాజం ద‌ృష్టికి తీసుకెళ్లంది. చైనా అండతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కశ్మీర్ వివాదంపై చర్చించేందుకు తెరలేపింది. అయితే అక్కడ కూడ చైనా మినహా అగ్రరాజ్యల మద్దతు లభించలేదు.. ఇక ఇక కశ్మీర్ అంశంపై ఇదివరకే పోరుగుదేశాలైన బూటాన్,మాల్దీవులు, నేపాల్, భారత్ మద్దతు పలకగా ప్రస్థుతం బంగ్లాదేశ్ మద్దతు కూడ లభించపోవడంతో పోరుగుదేశాల నుండి పాకిస్థాన్ ఓంటరి అవుతోంది. దీంతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకున్న భారత దేశం కశ్మీర్ వివాదంపై పూర్తి పట్టుసాధిస్తోంది.

English summary
More support for India's move on Jammu and Kashmir, after Maldives, Bhutan and Bangladesh, now Nepal too has come out and backed India on Kashmir issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X