వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక వేధింపులు: బంగ్లాదేశ్ యువతి గదికి పిలిచి...

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Bangladesh woman pours acid on stalker's ardour
ఢాకా: తనను వేధిస్తున్న ఓ యువకుడి పైన యాసిడ్ పోసిన ఓ యువతిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖదీముల్ ఇస్లాం అనే 28 ఏళ్ల వ్యక్తి చిన్న వ్యాపారి. అరెస్టైన యువతిని అతను కొంతకాలంగా వేధిస్తున్నాడు.

దీంతో ఆమె ఖదీముల్ పైన సోమవారం పదకొండు గంటల ప్రాంతంలో యాసిడ్‌తో దాడి చేసింది. అతనికి గాయాలయ్యాయి. ఈ ఘటన బలియడాంగి ఉపాజిలలో జరిగింది.

తన విచారణలో ఆమె జరిగిన విషయాన్ని వెల్లడించింది. ఖాదీముల్ గత కొంతకాలంగా తనను లైంగిక సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నాడని, తాను సున్నితంగా చెప్పినప్పటికీ అతను తన వేధింపులను ఆపలేదని పోలీసులకు చెప్పింది. అతని వేధింపులు ఎక్కువయ్యాయని, అతని గొడవ తన కుటుంబంలో సమస్యగా మారిందని, దీంతో ఆగ్రహం ఆపుకోలేక యాసిడ్ పోశానని చెప్పింది.

వేధింపులు తట్టుకోలేక అతనిని గత రాత్రి అతనిని తన గదికి పిలిపించానని, అయితే అతని ప్రతిపాదనకు తాను ఎట్టకేలకు అంగీకరించానని అతను గదికి వచ్చాడని, అతను వచ్చీ రాగానే గది తలుపులు మూసేసి యాసిడ్ పోశానని చెప్పింది.

కాగా, యాసిడ్ దాడి వల్ల గాయపడ్డ అతను బాధతో అరిచాడని, దీనిని గుర్తించిన చుట్టుపక్కల వారు అతనిని ఉపాజియా హెల్త్ కాంప్లెక్స్‌కు చికిత్స నిమిత్తం తీసుకు వెళ్లినట్లు పోలీసులు చెప్పారు. యాసిడ్ దాడిలో అతడి శరీరం, పురుషాంగంకు గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆమె పోలీసులకు వాంగ్మూలమిచ్చింది.

English summary

 A woman has been arrested in Bangladesh after she threw acid on a man she alleged was stalking her for a long time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X