వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

30 గంటలు..35 మంది వైద్యులు: అవిభక్త కవలలను వేరు చేసిన హంగేరీ డాక్టర్లు

|
Google Oneindia TeluguNews

ఢాకా: అవిభక్త కవలలు అనగానే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు టక్కున గుర్తుకొచ్చేవారు వీణా - వాణీలు. వారినీ ఇప్పటికీ వేరుచేయలేదు. బంగ్లాదేశ్‌‌కు చెందిన అవిభక్త కవలలను శస్త్ర చికిత్స చేసి విజయవంతంగా వేరు చేశారు హంగేరీకి చెందిన వైద్యులు. 30 గంటల పాటు నిర్విరామంగా శ్రమించి ఆపరేషన్ చేసి ఇద్దరి తలలను, మెదళ్లను వేరు చేశారు వైద్యులు.

రబేయా-రుకయా అనే మూడేళ్ల అవిభక్త కవలలను శస్త్ర చికిత్స చేసి వైద్యులు వేరుచేశారు. ప్రతి ఐదు నుంచి ఆరు మిలియన్ మందిలో ఒకరికి పుట్టుకతో వచ్చే అతి అరుదైన రుగ్మత ఈ చిన్నారులకు వచ్చింది. అయితే శస్త్రచికిత్స నిర్వహించిన తర్వాత ఇద్దరి పిల్లల ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఇద్దరు చిన్నారులను వేరుచేసేందుకు సర్జరీలో దాదాపు 35 మంది వైద్యులు పాల్గొన్నారు. శస్త్ర చికిత్స కంటే ముందు తల్లిదండ్రుల నుంచి వైద్యులు అనుమతి తీసుకున్నారు. అంటే ఆపరేషన్ చేసినప్పటికీ పిల్లలు బతికే అవకాశం 50శాతం మాత్రమే ఉన్నాయని వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆపరేషన్‌‌తో ముందుకు వెళుతామని వైద్యులు చిన్నారుల తల్లిదండ్రులకు తెలిపారు. భారం భగవంతుడిపై వేసి తమ పిల్లలను వేరు చేయాలంటూ వైద్యులకు తెలిపారు రబేయా-రుకయా తల్లిదండ్రులు.

conjoined twins
ఇక సర్జరీ ప్రారంభించిన వైద్యులు దాదాపు 30 గంటల పాటు శ్రమించారు. ఎట్టకేలకు ఆపరేషన్‌ను సక్సెస్ చేశారు. శస్త్రచికిత్స సందర్భంగా వీరి పుర్రె, మెదడు భాగాలను విడదీసి, హంగేరీలో ప్రత్యేక పరిస్థితుల మధ్య అభివృద్ధి చేసిన ఆ చిన్నారుల కణజాలంతో ఖాళీ భాగాలను భర్తీ చేశారు. కాగా, రబేయా, రుఖయాల పరిస్థితి గురించి తెలుసుకున్న ఏడీపీఎఫ్ (యాక్షన్ ఫర్ డిఫెన్స్ లెస్ పీపుల్ ఫౌండేషన్) ఆపరేషన్ కు సాయం చేసింది.
English summary
Two Bangladeshi girls who were born conjoined at the head have been successfully separated by a medical team led by 35 Hungarian doctors.The 3-year-old sisters, Rabeya and Rukaya, were in a stable condition after the 30-hour procedure ended Friday at a military hospital in Dhaka, the Bangladeshi capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X