• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రియుడి గుండె బయటికి తీసి హత్య: ప్రియురాలికి ఉరి

|

ఢాకా: ప్రియుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఓ మహిళకు మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రియుడికి నిద్ర మాత్రలు ఇచ్చి.. అనంతరం చేతులు, కాళ్లు కట్టేసి, గొంతు కోసి హతమార్చింది. ఆ తర్వాత అతి దారుణంగా అతడి గుండెను కోసి బయటకు తీసింది. ఈ దారుణ ఘటన బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. 21 ఏళ్ల ఫతేమా అఖ్తర్‌ సోనాలి.. ఇమ్దాదుల్ హక్ షిపాన్‌(28)లు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే సోనాలిని పెళ్లి చేసుకునేందుకు షిపాన్‌ అంగీకరించలేదు. అంతేగాక, సోనాలితో, ఇతర మహిళలతో సన్నిహితంగా గడిపిన దృశ్యాలను వీడియోలుగా తీసి అతను తన ల్యాప్‌టాప్‌లో భద్రపరుచుకున్నాడు.

Bangladeshi woman given death sentence for gouging lover's heart out

కాగా, ఆ వీడియోలను చూసిన సోనాలి.. షిపాన్‌ తనను మోసం చేశాడని ఆగ్రహానికి గురైంది. అతడ్ని ఎలాగైనా చంపేయాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో షిపాన్‌కు కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు ఇచ్చి తాగించింది. అనంతరం కిరాతకంగా కోసి అతని గుండెను బయటికి తీసి హత్య చేసింది. ఆ తర్వాత అతని గుండెను రెండు ముక్కలుగా చేసింది.

అయితే విచారణ సమయంలో సోనాలి చెప్పిన మాటలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. అంతమంది అమ్మాయిల్ని ప్రేమించిన షిపాన్‌కి ఎంత పెద్ద గుండె ఉందో చూసేందుకే తానీ పనిచేశానని చెప్పింది. సోనాలి మాటలతో న్యాయమూర్తి కూడా షాక్‌కి గురయ్యారు. నేరం అంగీకరించడంతో ఈ కేసులో సోనాలిని దోషిగా పరిగణిస్తూ.. మరణశిక్ష విధించింది న్యాయస్థానం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Fatema Akter Sonali has been given the death sentence in a rare judgement for a woman in Bangladesh. She was found guilty of murdering her lover and then gouging out his heart to see "how big the organ was".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more